పుట్లగట్లగూడెం సర్పంచ్ అభ్యర్థిగా మల్లిపూడి రవి నామినేషన్
జంగారెడ్డిగూడెం, మేజర్ న్యూస్ :మండలంలోని పుట్లగట్లగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కూటమి బలపరిచిన మల్లిపూడి రవి ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. దేవులపల్లి పంచాయతీలో నిర్వహించిన నామినేషన్ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేసే మల్లిపూడి రవిని సర్పంచ్‌గా భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం మండల జెడ్పీటీసీ గొల్లమందల సంకీర్తన, మండల టీడీపీ అధ్యక్షుడు కుక్కల మాధవరావు, పట్టణ టీడీపీ నాయకుడు దాకారపు కృష్ణ, మండల ఉపాధ్యక్షుడు గొల్లమందల శ్రీనివాస్, చింతలపూడి నియోజకవర్గ టీడీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ కొదమ వెంకటేశ్వరరావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు సీలం వెంకటరాజు, సీలం కృష్ణంరాజు, మాజీ జెడ్పీటీసీ రామచంద్రరావు, జనసేన నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.