తృటిలో తప్పిన పెను ప్రమాదం.. బైకర్‌కు స్వల్ప గాయాలు!
రామాయంపేట ; రామాయంపేట నుంచి కోనాపూర్‌కు వెళ్తున్న క్రమంలో గ్రామ శివారులో పెను ప్రమాదం తృటిలో తప్పింది. ట్రాక్టర్‌పై తరలిస్తున్న ధాన్యం సంచులు ఒక్కసారిగా కిందపడటంతో, వెనుకనే బైక్‌పై వస్తున్న వ్యక్తిపై పడ్డాయి. ఈ ఘటనలో బైకర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.
వెంటనే స్పందించిన స్థానికులు రోడ్డుపై పడిన ధాన్యం సంచులను తొలగించి, రాకపోకలకు అంతరాయం కలగకుండా రహదారిని క్లియర్ చేశారు. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.