కపిలేశ్వరాలయంలో శాస్త్రోక్తంగా నవగ్రహ హోమం
తిరుపతి సూర్య బ్యూరో: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జరుగుతున్న కార్తీక మాస హోమ మహోత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీ నవగ్రహ హోమం శాస్త్రోక్తంగా, భక్తిభావంతో వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా యాగశాలలో ఉదయం నవగ్రహ హోమం, పూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మహాశాంతి అభిషేకం, నవగ్రహ కలశాభిషేకం నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్చారణలు, వైదిక క్రతువులతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
అనంతరం సాయంత్రం శ్రీ దక్షిణామూర్తి స్వామివారి కలశస్థాపన, విశేష దీపారాధన నిర్వహించనున్నారు.
నేడు శ్రీ దక్షిణామూర్తి స్వామివారి హోమం
----------
కార్తీక మాస హోమ మహోత్సవాల్లో భాగంగా నేడు శ్రీ దక్షిణామూర్తి స్వామివారి హోమం నిర్వహించనున్నారు.
Raaju బ్యూరో, తిరుపతి జిల్లా