కల్వకుంట అంగన్వాడీలో మందుబాబుల హల్చల్
రామాయంపేట; నిజాంపేట మండల పరిధిలోని కల్వకుంట 4వ అంగన్వాడి సెంటర్ లో మందుబాబులు వీరంగం సృష్టించారు. మందుబాబులు మందు తాగి అంగన్వాడి సెంటర్ ఆవరణలో సీసాలు పగలగొట్టి చిన్నారులకు ఇబ్బందులు గురి చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇటీవల ప్రాథమిక పాఠశాల ఆవరణలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇకనైనా గ్రామ పెద్దలు సంబంధిత అధికారులు చొరవ చూపి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు అంగన్వాడి టీచర్ కోరుతున్నారు.