BREAKING
గొర్రెల చోరీ నిందితుల అరెస్టు... రిమాండ్ కు తరలింపు.... కిసాన్‌ మోర్చా అధ్యక్ష బాధ్యతలు.. కృతజ్ఞతలు తెలిపిన మల్లారెడ్డి మంత్రి పొంగులేటి ని మర్యాదపూర్వకంగా కలిసిన ఇల్లందు మున్సిపల్ చైర్పర్సన్ కిరణ్ మిత్ర డానియల్ మాజీ జెడ్పిటిసి సింగం సత్తయ్యను పరామర్శించిన ఎంపీ ఈటల రాజేందర్ 600 మంది లబ్ధిదారులకు చేయూత పెన్షన్ మంజూరు పత్రాలు వై.టి. రాజా ఆశయాలే మా రాజకీయ ప్రస్థానానికి మార్గదర్శకం -రాజకీయంగా తన ఎదుగుదలకు రాజా ప్రోత్సాహమే పునాది -మాజీ ఎమ్మెల్యే వై.టి. రాజా వర్ధంతి సభలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అన్ని వర్గాల అభివృద్ధి -సీఎం సభలో మరిన్ని కొత్త పథకాల ప్రకటనకు అవకాశం తెలియని కుటుంబానికి కట్టబెట్టడం కంటే సినీ రంగమే మేలు.. శ్రుతి హాసన్ గురించి కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు గ్రామాభివృద్ధికి ఆశీర్వదించాలని ఓటర్లను అభ్యర్థించిన ప్రజానాయకుడు...... 15,16 వార్డుల్లో సర్పంచ్ అభ్యర్థి బొమ్మన రవీంద్రనాథ్‌రెడ్డి ఇంటింటి ప్రచారం..... కోహెడ నాగ సముద్రాల మోడల్ స్కూల్‌ను ముక్కలు చేసే రోడ్డు అలైన్‌మెంట్‌ను వెంటనే మార్చాలి సినీ పరిశ్రమలో ఆ హీరోనే నాకు మంచి స్నేహితుడు.. జూనియర్ ఎన్టీఆర్‌పై మమతా మోహన్‌దాస్ ఆసక్తికర వ్యాఖ్యలు మదనపల్లె పట్టణంలో వెల్లివిరిసిన మతసామరస్యం : హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో అయ్యప్ప మాలధారులకు భిక్ష : హాజరైన ట్రాఫిక్ సిఐ చాన్ బాషా,కామకోటి ప్రసాదరావు యాసంగి సాగులో పంటల మార్పిడికి రైతులు సహకరించాలి – తిరుపతి జిల్లా పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ తిరుపతి జిల్లా పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ

సీబీఐ అధికారులమంటూ రియల్టర్ కిడ్నాప్ : రూ.5 కోట్లు డిమాండ్ - ఆరుగురు నిందితులు అరెస్ట్ : బాధితుడుని కాపాడిన మదనపల్లి పోలీసులు : వన్ టౌన్ సీఐ మోహన్ కుమార్ వెల్లడి

Select Suryaa Now
సీబీఐ అధికారులమంటూ రియల్టర్ కిడ్నాప్ : రూ.5 కోట్లు డిమాండ్ - ఆరుగురు నిందితులు అరెస్ట్ : బాధితుడుని కాపాడిన మదనపల్లి పోలీసులు : వన్ టౌన్ సీఐ మోహన్ కుమార్ వెల్లడి

మదనపల్లె టౌన్,మేజర్ న్యూస్ : సినిమా తరహాలో సీబీఐ ఐడీ కార్డులు,అరెస్ట్ వారెంట్ పత్రాలు,డమ్మీ పిస్టల్,సంకెళ్లతో వచ్చి ఓ వ్యాపారిని కిడ్నాప్ చేసిన ముఠాగుట్టును మదనపల్లె వన్‌టౌన్ పోలీసులు ఆదివారం రట్టు చేశారు.బాధితుడిని సురక్షితంగా విడిపించి ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు.వన్‌టౌన్ సీఐ మోహన్ కుమార్,ఎస్ఐలు రహీముల్లా,రామకృష్ణారెడ్డిలు తెలిపిన వివరాల మేరకు మదనపల్లె అగర్త వీధికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి సాదిక్ ఈ నెల 10న మధ్యాహ్నం 3.30 గంటలకు మడికయ్యల శివాలయం మీదుగా మల్లికార్జున సర్కిల్ వైపు కారులో బయలుదేరారు.అదే సమయంలో ముఠా సభ్యులు అతని కారును కబరస్తాన్ వద్ద అడ్డుకున్నారు.మేము సీబీఐ,నీపై కేసు ఉంది అంటూ నకిలీ సీబీఐ ఐడీ కార్డులు,అరెస్ట్ వారెంట్ చూపి బలవంతంగా కారులో ఎక్కించుకుని కర్ణాటక రాష్ట్రం తుమకూరు జిల్లాలోని ఓ ఫాంహౌస్‌కు తీసుకెళ్లారు.కేసు నుంచి తప్పించాలంటే రూ.5 కోట్లు కావాలని,లేకుంటే చంపేస్తామని బెదిరించారు.ఫాంహౌస్‌లో రెండు రోజుల పాటు బాధితుడిని బంధించి మానసికంగా,శారీరకంగా భయభ్రాంతులకు గురిచేశారు.కుటుంబానికి దూరమై,ప్రాణభయంతో వణికిపోయిన సాదిక్ భయపడి బంధువులు,స్నేహితుడి సాయంతో రూ.26 లక్షలు వారి ఖాతాకు బదిలీ చేయించాడు.బాధితుడి సోదరుడి ఫిర్యాదుతో వన్‌టౌన్ పీఎస్‌లో క్రైమ్ నెం.200/2026గా కేసు నమోదు చేశారు.జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో,ఎస్‌డీపీఓ బి.ప్రసాద్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దించారు.ఈ నెల 14న మధ్యాహ్నం 3 గంటలకు మదనపల్లె-బెంగళూరు రోడ్డులో కాపుకాసి ముఠాను చుట్టుముట్టి పట్టుకున్నారు.రియల్టర్ సాదిక్‌ను సురక్షితంగా విడిపించి నిందితులను పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు.రూ.26 లక్షల ఖాతాను ఫ్రీజ్ చేశారు.ఈ కేసులో ప్రధాన ముద్దాయి తిరుపతికి చెందిన రమణ పరారీలో ఉండగా అరెస్టయిన వారిలో చిత్తూరు కట్టమంచికి చెందిన రాజా శ్రీనివాసులు అలియాస్ ఆర్.శ్రీనివాసన్ (40),కర్ణాటక రాష్ట్రం మైసూరుకు చెందిన ఎం.పి.సోహన్ భరత్ (39),బెంగళూరుకు చెందిన కె.ఎన్.సార్థక్ రాజ్ (33),చేతన్ రాజు (31),చిత్తూరు టౌన్ అంబేడ్కర్ నగర్‌కు చెందిన పి.సురేష్ సింగ్ (40),వేణు,గుణశేఖర్ (30) ఉన్నారు.నిందితుల నుంచి రెండు నకిలీ సీబీఐ ఐడీ కార్డులు,డమ్మీ పిస్టల్,జత చేతి సంకెళ్లు,22 పేజీల ఫైల్,కేఏ-51- ఎంఎస్-0489 నంబరు గల ఇన్నోవా క్రిస్టా కారు స్వాధీనం చేసుకున్నారు.మరో నిందితుడు రమణను అరెస్ట్ చేయాల్సి ఉందని సీఐ తెలిపారు.

సినిమాను మించిన స్కెచ్

కిడ్నాప్ అయిన నిందితుడితో సహా అరెస్టయిన నిందితులందరూ వివిధ కేసుల్లో ముద్దాయిలు.కేసుల్లో కోర్టుల చుట్టూ తిరుగుతూ విడిపోయి వేరువేరు చోట్ల స్థిరపడ్డారని సీఐ తెలిపారు.ఈ క్రమంలో డబ్బు బాగా సంపాదించుకున్న సాదిక్‌ను కిడ్నాప్ చేయాలని సినిమా తరహాలో స్కెచ్ వేసి పథకం ప్రకారం మదనపల్లిలో రియల్టర్ సాదిక్‌ను నిందితులు కిడ్నాప్ చేసినట్లు తెలిపారు.ఫిర్యాదు అందిన వెంటనే వేగంగా కేసును ఛేదించిన మదనపల్లి పోలీసులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి