*విశ్రాంత జేడీ డాక్టర్ బూసి అంజయ్యకు ఘన నివాళులు* --ఉద్యోగ, వ్యాపార, రాజకీయ ప్రముఖుల సంతాపం
ఏలూరు, మేజర్ న్యూస్ : ఒక వైపు వైద్య రంగానికి, మరో వైపు షెడ్యూల్ కులాల ఉద్యోగుల సంఘానికి, పేదలకు, ప్రభుత్వ ఉద్యోగ సంఘాలకు ఉమ్మడి రాష్ట్రంలో ఆరోగ్యశాఖ విశ్రాంత జాయింట్ డైరెక్టర్
డాక్టర్ బూసి అంజయ్య అందించిన సేవలు అజరామని గౌరవ అతిధిగా హాజరైన ఏలూరు డిఎస్పీ శ్రావణ్ కుమార్ కొనియాడారు.
దెందులూరు మండలం కొవ్వలి గ్రామానికి చెందిన డాక్టర్ బూసి అంజయ్య సంస్మరణ సభ ఆదివారం ఏలూరులో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించబడింది.
సభకు అధ్యక్షత వహించిన బహుజన ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ దేవరకొండ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అంజయ్య డాక్టర్ గా, ఉద్యోగ సంఘాల నాయకుని గా అందించిన సేవలు వెల కట్టలేనివని పేర్కొన్నారు .
ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉషా పిక్చర్స్ అధినేత, కొవ్వలి గ్రామస్థులు ఉషా బాలకృష్ణ
మాట్లాడుతూ అంజయ్య ప్రభుత్వ డాక్టర్ల సంఘానికి, ఎస్సీ ఉద్యోగుల సంఘానికి నాయకత్వం వహిస్తూనే ఎన్జీవో సంఘంలో యువ
నాయకులుగా ఉన్న అనేక మందిని ప్రోత్సహించే వారని, నిత్యం సమాజ ఉద్దరణకు పాటుపడే వారని తెలిపారు.
అంజయ్య వియ్యంకులు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ విశ్రాంత ఇంజనీర్ ఇన్ చీఫ్ బొంతు రాజేశ్వరరావు, సర్.సి.ఆర్, ఆర్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ నక్కా చర్చల్ డేనియల్ ,
ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్స్ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పూర్వ గవర్నర్ కె.వి కిషోర్ కుమార్, కాకరాల వేణు బాబు,
పెదవేగి ఎస్.యం.సి. విద్యాసంస్థ అధినేత అవినాష్ రాజు ,
బహుజన నాయకులు మెండెం సంతోష్, కుమార్ ,కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు,బూసి ఏఫ్రైమ్ , మార్రాజు, కమ్ముల వెంకటేశ్వరావు, మేతర అజయ్, కాపుదాసి రవి, డోమినిక్,లయన్స్ లీడర్స్ విజయభాస్కర్ రెడ్డి, స్వరూప్, రత్నకుమార్,ఎన్వీ సురేష్ కుమార్,ఎన్జీవో నాయకులు లాం విద్యసాగర్, విలేఖరి స్వామి, రిటైర్డ్ డిఎం అండ్ హెచ్ ఓ రాజేశ్వరరావు,
, డాక్టర్ కేవీ ప్రభాకర్ రావు, తదితరులు ప్రసంగించారు. అంజయ్య కుమారులైన వ్యాపారవేత్త సురేంద్ర, ఐ.ఎఫ్.ఎస్. అధికారైన సుచింద్ర, కుమార్తె సునీత, కోడళ్ళు శారద, భార్గవి,
, ఇతర కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.