BREAKING
కపిలేశ్వరాలయంలో శాస్త్రోక్తంగా నవగ్రహ హోమం సీబీఐ అధికారులమంటూ రియల్టర్ కిడ్నాప్ : రూ.5 కోట్లు డిమాండ్ - ఆరుగురు నిందితులు అరెస్ట్ : బాధితుడుని కాపాడిన మదనపల్లి పోలీసులు : వన్ టౌన్ సీఐ మోహన్ కుమార్ వెల్లడి ఇందిరమ్మ ఇళ్లు పేదలకు వరం ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి ఇటలీ పోటీల్లో నయనశ్రీ మెరుగైన ప్రదర్శన.. బోనకల్‌కు చెందిన క్రీడాకారిణి సత్తా గ్రంథాలయ పఠనంపై విద్యార్థులు ఆసక్తి పెంచుకోవాలి : గ్రంథాలయ అధికారి బి.చంద్రశేఖర్ నాయక్ వెల్లడి పల్లె ప్రకృతి వనంలో పెరిగిన చెట్లను నరికి వేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. బూరుగుపల్లి సర్పంచ్ పెరుమాండ్లు గౌడ్. అసంపూర్తి రోడ్డు అతివేగంతో దూసుకెళ్తున్న వాహనాలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్న పి కొత్తకోట వాసులు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని ఆవేదన శ్రీ గురుదత్త శివానంద ఆశ్రమంలో వైభవంగా చండీయాగం : పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ చినబాబు,టిడిపి నేత నందకుమార్ అంగన్వాడి కేంద్రంలో సామూహిక సీమంతాలు అన్నప్రాసరణ బాధిత కుటుంబానికి సీఎంఆర్ చెక్కు పంపిణీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజల సహకరించాలి. జపాన్ ఓపెన్ ఫైనల్లో లక్ష్యసేన్.. అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో మరో అరుదైన ఘనత తృటిలో తప్పిన పెను ప్రమాదం.. బైకర్‌కు స్వల్ప గాయాలు! కల్వకుంట అంగన్వాడీలో మందుబాబుల హల్చల్ భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ.. ఐసీసీ మెగా టోర్నీల క్యాలెండర్ విడుదల

శ్రీవారి ఆలయంలో పుష్పయాగానికి శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌

Select Suryaa Now
శ్రీవారి ఆలయంలో పుష్పయాగానికి శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌

తిరుమల మేజర్ న్యూస్,

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో సోమవారం జ‌రుగ‌నున్న పుష్ప‌యాగానికి ఆదివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ జ‌రిగింది.ఈ సందర్భంగా ఉదయం శ్రీవారి ఆలయంలో మూలవిరాట్‌ ఎదురుగా ఆచార్య ఋత్విక్‌వరణం నిర్వహించారు. అర్చకులకు విధుల కేటాయింపునే ఋత్విక్‌వరణం అంటారు. ఇందులో వైదిక కార్యక్రమాల నిర్వహణ కోసం ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యతను అప్పగిస్తారు. సాక్షాత్తు శ్రీవారి ఆజ్ఞ మేరకు విధులు పొందినట్టు అర్చకులు భావిస్తారు. సాయంత్రం 6 గంట‌ల‌కు శ్రీ‌వారి సేనాధిప‌తి అయిన శ్రీ విష్వ‌క్సేనుల వారిని ఆల‌యం నుండి వ‌సంత మండ‌పానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్క‌డ మృత్సంగ్ర‌హ‌ణం, ఆస్థానం నిర్వ‌హించి తిరిగి శ్రీ‌వారి ఆల‌యానికి చేరుకున్నారు. రాత్రి 8 నుండి 9 గంట‌ల నడుమ ఆల‌యంలోని యాగ‌శాల‌లో అంకురార్ప‌ణ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. అంకురార్పణం కారణంగా సహస్రదీపాలంకార సేవను టిటిడి ర‌ద్దు చేసింది.ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య అధికారులు పాల్గొన్నారు.

న‌వంబ‌రు 16న ఈరోజు పుష్ప‌యాగం

శ్రీ‌వారి ఆల‌యంలో సోమవారం పుష్పయాగం సంద‌ర్భంగా ఉద‌యం 9 నుండి 11 గంట‌ల వ‌ర‌కు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణమండపానికి వేంచేపు చేసి స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ‌ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు.మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం సహస్రదీపాలంకార సేవ తరువాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీమలయప్పస్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ కారణంగా ఆర్జితసేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత‌ బ్రహ్మోత్సవాన్ని టిటిడి రద్దు చేసింది.

తిరుమల రిపోర్టర్

టి .వెంకట్ రాజ్