BREAKING
కపిలేశ్వరాలయంలో శాస్త్రోక్తంగా నవగ్రహ హోమం సీబీఐ అధికారులమంటూ రియల్టర్ కిడ్నాప్ : రూ.5 కోట్లు డిమాండ్ - ఆరుగురు నిందితులు అరెస్ట్ : బాధితుడుని కాపాడిన మదనపల్లి పోలీసులు : వన్ టౌన్ సీఐ మోహన్ కుమార్ వెల్లడి ఇందిరమ్మ ఇళ్లు పేదలకు వరం ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి ఇటలీ పోటీల్లో నయనశ్రీ మెరుగైన ప్రదర్శన.. బోనకల్‌కు చెందిన క్రీడాకారిణి సత్తా గ్రంథాలయ పఠనంపై విద్యార్థులు ఆసక్తి పెంచుకోవాలి : గ్రంథాలయ అధికారి బి.చంద్రశేఖర్ నాయక్ వెల్లడి పల్లె ప్రకృతి వనంలో పెరిగిన చెట్లను నరికి వేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. బూరుగుపల్లి సర్పంచ్ పెరుమాండ్లు గౌడ్. అసంపూర్తి రోడ్డు అతివేగంతో దూసుకెళ్తున్న వాహనాలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్న పి కొత్తకోట వాసులు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని ఆవేదన శ్రీ గురుదత్త శివానంద ఆశ్రమంలో వైభవంగా చండీయాగం : పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ చినబాబు,టిడిపి నేత నందకుమార్ అంగన్వాడి కేంద్రంలో సామూహిక సీమంతాలు అన్నప్రాసరణ బాధిత కుటుంబానికి సీఎంఆర్ చెక్కు పంపిణీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజల సహకరించాలి. జపాన్ ఓపెన్ ఫైనల్లో లక్ష్యసేన్.. అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో మరో అరుదైన ఘనత తృటిలో తప్పిన పెను ప్రమాదం.. బైకర్‌కు స్వల్ప గాయాలు! కల్వకుంట అంగన్వాడీలో మందుబాబుల హల్చల్ భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ.. ఐసీసీ మెగా టోర్నీల క్యాలెండర్ విడుదల

గ్రంథాలయాలకు రండి.. విజ్ఞానాన్ని పెంచుకోండి పురవీధుల్లో విద్యార్థుల భారీ ర్యాలీ పూతలపట్టు గ్రంథాలయంలో ఘనంగా పుస్తక ప్రదర్శన

Select Suryaa Now
గ్రంథాలయాలకు రండి.. విజ్ఞానాన్ని పెంచుకోండి  పురవీధుల్లో విద్యార్థుల భారీ ర్యాలీ  పూతలపట్టు గ్రంథాలయంలో ఘనంగా పుస్తక ప్రదర్శన

పూతలపట్టు మేజర్ న్యూస్ :

​59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా పూతలపట్టు గ్రంథాలయం ఆధ్వర్యంలో విద్యార్థులతో భారీ అవగాహన ర్యాలీ, ప్రత్యేక పుస్తక ప్రదర్శనను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు పూతలపట్టు పురవీధుల గుండా ర్యాలీ నిర్వహిస్తూ "గ్రంథాలయానికి రండి పుస్తకాలు చదవండి", "ప్రపంచ జ్ఞానం రావాలంటే పత్రికలు చదవాలి", "గ్రంథాలయం ఒక దేవాలయం", "గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు" అనే నినాదాలతో హోరెత్తించారు అలాగే మారుతున్న కాలానికి అనుగుణంగా గ్రంథాలయంలో అందుబాటులో ఉన్న డిజిటల్ యాప్ సేవలను కూడా ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ప్రజలకు, తోటి విద్యార్థులకు పిలుపునిచ్చారు ​అనంతరం గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పుస్తక ప్రదర్శనను ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు సత్యనారాయణ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం పుస్తక పఠనం చేసే వారే సమాజంలో గొప్ప విజ్ఞానవంతులుగా తయారవుతారని పేర్కొన్నారు భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రోజుకు 18 గంటల పాటు పుస్తకాలు చదివేవారని గుర్తు చేస్తూ, విద్యార్థులందరూ ఆయనను ఆదర్శంగా తీసుకొని గ్రంథాలయాలకు వచ్చి బాగా చదువుకోవాలని సూచించారు ఈ ​కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి తాళ్ల రవీంద్రబాబు మాట్లాడుతూ "చినిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో" అనే నానుడిని విద్యార్థులకు వివరించి, పుస్తకాల ప్రాముఖ్యతను తెలియజేశారు అనంతరం గ్రంథాలయంలో ప్రదర్శనకు ఉంచిన వివిధ రకాల విజ్ఞాన, సాహిత్య పుస్తకాలను విద్యార్థులందరూ ఎంతో ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఉపాధ్యాయులు, పాఠకులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

పూతలపట్టు రిపోర్టర్ దిలీప్ కుమార్