BREAKING
కపిలేశ్వరాలయంలో శాస్త్రోక్తంగా నవగ్రహ హోమం సీబీఐ అధికారులమంటూ రియల్టర్ కిడ్నాప్ : రూ.5 కోట్లు డిమాండ్ - ఆరుగురు నిందితులు అరెస్ట్ : బాధితుడుని కాపాడిన మదనపల్లి పోలీసులు : వన్ టౌన్ సీఐ మోహన్ కుమార్ వెల్లడి ఇందిరమ్మ ఇళ్లు పేదలకు వరం ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి ఇటలీ పోటీల్లో నయనశ్రీ మెరుగైన ప్రదర్శన.. బోనకల్‌కు చెందిన క్రీడాకారిణి సత్తా గ్రంథాలయ పఠనంపై విద్యార్థులు ఆసక్తి పెంచుకోవాలి : గ్రంథాలయ అధికారి బి.చంద్రశేఖర్ నాయక్ వెల్లడి పల్లె ప్రకృతి వనంలో పెరిగిన చెట్లను నరికి వేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. బూరుగుపల్లి సర్పంచ్ పెరుమాండ్లు గౌడ్. అసంపూర్తి రోడ్డు అతివేగంతో దూసుకెళ్తున్న వాహనాలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్న పి కొత్తకోట వాసులు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని ఆవేదన శ్రీ గురుదత్త శివానంద ఆశ్రమంలో వైభవంగా చండీయాగం : పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ చినబాబు,టిడిపి నేత నందకుమార్ అంగన్వాడి కేంద్రంలో సామూహిక సీమంతాలు అన్నప్రాసరణ బాధిత కుటుంబానికి సీఎంఆర్ చెక్కు పంపిణీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజల సహకరించాలి. జపాన్ ఓపెన్ ఫైనల్లో లక్ష్యసేన్.. అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో మరో అరుదైన ఘనత తృటిలో తప్పిన పెను ప్రమాదం.. బైకర్‌కు స్వల్ప గాయాలు! కల్వకుంట అంగన్వాడీలో మందుబాబుల హల్చల్ భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ.. ఐసీసీ మెగా టోర్నీల క్యాలెండర్ విడుదల

క్రీడా హబ్ గా తిరుపతి -రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బ్యాట్మెంటన్ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభం -ముఖ్య అతిథిగా హాజరైన శాప్ చైర్మన్ రవి నాయుడు

Select Suryaa Now
క్రీడా హబ్ గా తిరుపతి -రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బ్యాట్మెంటన్ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభం -ముఖ్య అతిథిగా హాజరైన శాప్ చైర్మన్ రవి నాయుడు

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : క్రీడలను క్రీడాకారులను మరింత అభివృద్ధికితిరుపతిని క్రీడా హబ్ గా మారుస్తామని శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు ప్రకటించారు. అవిలాల అట్లాస్ బ్యాడ్మింటన్ అకాడమీలో చిత్తూరు జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యోనెక్స్ సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీలను ఆయన ముఖ్య అతిథిగా ప్రారంభించారు.ఈ సందర్భంగా రవి నాయుడు మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీలు యువ క్రీడాకారుల్లో పోటీతత్వాన్ని పెంచడంతో పాటు ప్రతిభను వెలికితీసే గొప్ప వేదికన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. తిరుపతిని వేదికగా ఎంచుకున్న బ్యాడ్మింటన్ అసోసియేషన్ ను అభినందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ఏపీని క్రీడా రంగంలో దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. క్రీడాకారులకు మెరుగైన వసతులు, శిక్షణ, ప్రోత్సాహం కల్పిస్తున్నామని, కూటమి ప్రభుత్వం వచ్చాక తిరుపతిని క్రీడా కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. బ్యాడ్మింటన్ క్రీడకు ప్రత్యేకంగా ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు. యువ క్రీడాకారులు ప్రభుత్వ అవకాశాలను సద్వినియోగం చేసుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి పేరు తేవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు కె.సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీ అజయ్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ పి.రామకృష్ణయ్య, శివయ్య పాల్గొన్నారు. 400 మంది యువ క్రీడాకారులు పాల్గొన్నారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్