కీసరలో అమోర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం.. 300 మందికి పైగా వైద్య పరీక్షలు
కీసర, మేజర్ న్యూస్: పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో కీసర కల్యాణ మండపంలో అమోర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ శిబిరంలో 300 మందికి పైగా ప్రజలు పాల్గొని వివిధ రకాల వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు తమ ఆరోగ్య సమస్యలను వైద్యులకు వివరించి అవసరమైన పరీక్షలు చేయించుకున్నారు. ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు ముందుకొచ్చిన నిర్వాహకులపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శిబిరాన్ని ఏర్పాటు చేసిన పీఏసీఎస్ చైర్మన్ రామిడి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని, వారి సంక్షేమం కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమని పేర్కొన్నారు. అనంతరం ఈ శిబిరంలో పాల్గొన్న వివిధ పార్టీల నాయకులతో పాటు ఉదయం నుంచి ప్రజలకు వైద్య సేవలు అందించిన అమోర్ లయన్స్ క్లబ్ వైద్యులు, టెక్నీషియన్లు, నర్సులు, వైద్య సిబ్బందిని రామిడి ప్రభాకర్ రెడ్డి ఘనంగా సన్మానించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులోనూ కొనసాగించాలని పలువురు ఆకాంక్షించారు.