BREAKING
అంగన్వాడి కేంద్రంలో సామూహిక సీమంతాలు అన్నప్రాసరణ బాధిత కుటుంబానికి సీఎంఆర్ చెక్కు పంపిణీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజల సహకరించాలి. జపాన్ ఓపెన్ ఫైనల్లో లక్ష్యసేన్.. అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో మరో అరుదైన ఘనత తృటిలో తప్పిన పెను ప్రమాదం.. బైకర్‌కు స్వల్ప గాయాలు! కల్వకుంట అంగన్వాడీలో మందుబాబుల హల్చల్ భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ.. ఐసీసీ మెగా టోర్నీల క్యాలెండర్ విడుదల శ్రీవారి ఆలయంలో పుష్పయాగానికి శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌ బౌలర్ల పోరాటంతోనే చారిత్రక సిరీస్ విజయం.. శ్రేయస్ అయ్యర్ హర్షం గ్రంథాలయాలకు రండి.. విజ్ఞానాన్ని పెంచుకోండి పురవీధుల్లో విద్యార్థుల భారీ ర్యాలీ పూతలపట్టు గ్రంథాలయంలో ఘనంగా పుస్తక ప్రదర్శన ఘనంగా రోషిణి–గిరీష్ గౌడ్‌ల వివాహ వేడుక. కొల్చారం మండలానికి 548 నూతన పింఛన్లు మంజూరు: చీరాల వాడరేవు రోడ్ లో రోడ్డు ప్రమాదం ఒకరి పరిస్థితి విషమం క్రీడా హబ్ గా తిరుపతి -రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బ్యాట్మెంటన్ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభం -ముఖ్య అతిథిగా హాజరైన శాప్ చైర్మన్ రవి నాయుడు *విశ్రాంత జేడీ డాక్టర్ బూసి అంజయ్యకు ఘన నివాళులు* --ఉద్యోగ, వ్యాపార, రాజకీయ ప్రముఖుల సంతాపం

పురాతన ఆలయాకృతికి పూర్వవైభవం తీసుకురావాలి..! -- ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి

Select Suryaa Now
పురాతన ఆలయాకృతికి పూర్వవైభవం తీసుకురావాలి..! -- ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి
మాచర్ల న్యూస్ : పల్నాడు ప్రాంతంలో దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ప్రముఖ శైవక్షేత్రం సత్రశాల గంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి పురాతన ఆలయాకృతికి పూర్వవైభవం తెచ్చేలా కట్టడాలను పునర్నిర్మించాలని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి సూచించారు. ఆదివారం ఆలయాన్ని సందర్శించిన ఆయన గర్జాలయంలోని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణాన్ని కలయతిరిగారు. పంచాయతీ ఎన్నికలు అనంతరం కూటమి ప్రభుత్వం మంజూరు చేసిన రూ.5 కోట్ల నిధులతో చేపట్టనున్న ఆలయ పునర్నిర్మాణ పనులపై సమీక్షించారు. జీవం ఉట్టేపడే దేవమూర్తులు, ప్రాచీన సంస్కృతికి తగ్గట్లు ఉప ఆలయాల నిర్మాణం, శ్రీ భ్రమరాంబ దేవి గర్జాలయంలో శ్రీ చక్రం ప్రతిష్టాపన, దేవాదాయ శాఖ ఇంజనీర్ డిపార్ట్మెంట్ అందించిన ప్లానింగ్ ప్రకారం వాస్తు లోపం లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో ఆలయ ఈవో రామిరెడ్డి, టీడీపీ యువ నాయకులు గౌతయ్ జూలకంటి, మండల నాయకులు జూలకంటి గౌతమ్ రెడ్డి, మండల నాయకులు చపారపు అబ్బిరెడ్డి, గొంటు సుమంత్ రెడ్డి, శొంఠిరెడ్డి నర్సిరెడ్డి, మున్నా ప్రభురాజు, మందలపు హనిమిరెడ్డి, అల్లం ప్రతాప్ రెడ్డి, అదూరి ఇన్నారెడ్డి బోడపాటి రామకృష్ణ, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.