BREAKING
*యాసంగి సాగులో పంటల మార్పిడికి రైతులు సహకరించాలి – రైతువారీ వివరాలను క్రాప్ డేటా పోర్టల్‌లో నమోదు చేయించుకోవాలి ఏఓ సతీష్ భీమవరం మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా డాక్టర్ చుండూరి మల్లేశ్వరి చైర్మన్ అభ్యర్థిత్వంపై పలువురి పేర్లు ప్రచారంలోకి.. చివరకు వైద్యురాలికి జనసేన అధిష్టానం అవకాశం కవిత్వం రాయడం ఓ తపస్సు ,అమరావతి సాహితీ మిత్రులు సభలో డా. రావి రంగారావు న్యూజిలాండ్ గడ్డపై టీమిండియా చరిత్ర.. ఒకే పర్యటనలో వన్డే, టీ20 సిరీస్‌లు కైవసం 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో " పుస్తక ప్రదర్శన " కీసరలో అమోర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం.. 300 మందికి పైగా వైద్య పరీక్షలు సేవ సమాజానికి స్ఫూర్తి...! -విశిష్ట సేవలందించిన వారికి సూర్యచంద్ర ఫౌండేషన్ పురస్కారాలు -అంకితభావంతో పనిచేసే వారికి గుర్తింపునివ్వడం అభినందనీయం : విసి ఉమ ఘనంగా పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ వార్షికోత్సవం పుస్తక పఠనంతోనే విజ్ఞానం వికాసం - గ్రంథాలయ అధికారి రాకేష్ అరంగేట్ర టెస్టు తొలి బంతికే అవుట్.. మహ్ఫిజుల్ ఇస్లామ్‌కు చేదు అనుభవం, రబాడ అరుదైన రికార్డు శ్రీకాళహస్తి పురపాలక సంఘం వైయస్సార్ పార్టీ చైర్మన్ అభ్యర్థిగా జ్ఞానాంబ గారి మధు రెడ్డి జనసేనలో కష్టపడిన కార్యకర్తకు గుర్తింపు కరువేనా? వలస కమలాదేవి మంచికి మారుపేరు వారిసేవలను గుర్తిస్తూ ఘనమైన నివాళులర్పించిన కూరెళ్ళ గ్రామ సర్పంచ్ బండారు లక్ష్మి బాలరాజు గ్రామ ప్రజలు న్యూజిలాండ్‌పై థ్రిల్లింగ్ విక్టరీ.. 3-1 తేడాతో వన్డే సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా నేడే రామాలయంలో కార్తీక్ సోమవారాల వ్రతం

లీజ్‌ ఒప్పందం పేరుతో అదనపు నగదు డిమాండ్‌.. మహిళా వ్యాపారికి బెదిరింపులు

Select Suryaa Now
లీజ్‌ ఒప్పందం పేరుతో అదనపు నగదు డిమాండ్‌.. మహిళా వ్యాపారికి బెదిరింపులు

ఘట్‌కేసర్‌ రూరల్‌, మేజర్‌ న్యూస్‌: లీజ్‌ ఒప్పందానికి విరుద్ధంగా అదనపు నగదు డిమాండ్‌ చేస్తూ తనను వేధింపులకు, బెదిరింపులకు గురిచేస్తున్నారని జోడిమెట్ల సమీపంలో వొకాస్‌ ఫుడ్‌ కోర్టు ఏర్పాటు చేస్తున్న నిర్వాహకురాలు హరిత గోగినేని ఆరోపించారు. ఫోర్జరీ ఆరోపణలతో తనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వ్యాపారం ప్రారంభించకముందే ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై పోలీసు కమిషనర్‌ను కలిసి ఆధారాలు సమర్పించడంతో పాటు న్యాయం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు తెలిపారు.ఆదివారం విలేకరులతో ఆమె మాట్లాడుతూ.. ఘట్‌కేసర్‌ సర్కిల్‌ పోచారం డివిజన్‌ పరిధిలోని జోడిమెట్ల సమీపంలో జాతీయ రహదారి పక్కన గతంలో రెస్టారెంట్‌ నిర్వహించిన ప్రాంగణంలో ఫుడ్‌ కోర్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఆకిటి మంజుల, ఆమె కుమారుడు ఆకిటి దివాకర్‌రెడ్డికి చెందిన ప్లాట్‌ నంబర్‌ 1ను లీజుకు తీసుకున్నానని, అధికారిక లీజ్‌ డీడ్‌ చేయడంలో జాప్యం జరగడంతో తాత్కాలిక ఒప్పంద పత్రాలు పొందినట్లు వివరించారు. వాటి ఆధారంగా జీఎస్టీ నమోదు, ఆహార భద్రత లైసెన్స్‌ పొందినట్లు పేర్కొన్నారు. ఏప్రిల్‌ నుంచి క్రమం తప్పకుండా అద్దె చెల్లిస్తున్నప్పటికీ ఒప్పందానికి మించి అదనపు నగదు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు.అలాగే ప్లాట్‌ నంబర్‌ 2కు సంబంధించి శ్రీనివాస్‌రెడ్డితో నిబంధనల ప్రకారం ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. అయితే గతంలో రెస్టారెంట్‌ నిర్వహించిన వినయ్‌కుమార్‌తో పాటు మంజుల, దివాకర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి కలిసి తాను నకిలీ పత్రాలు సృష్టించి జీఎస్టీ, ఫుడ్‌ లైసెన్స్‌ పొందినట్లు పోచారం ఐటీ కారిడార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారని వెల్లడించారు. ఆ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ, తాను సమర్పించిన ఆధారాలను పరిగణనలోకి తీసుకోకుండా తన ఫిర్యాదుపై తగిన చర్యలు తీసుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.అదనపు డబ్బులు చెల్లించకపోతే ప్రాంగణాన్ని ఖాళీ చేయాలని హెచ్చరిస్తున్నారని, తాను పెట్టిన పెట్టుబడిని తిరిగి ఇవ్వాలని కోరినా స్పందించడం లేదని ఆరోపించారు. ఈ పరిణామాలతో తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నానని, తనకు ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు కమిషనర్‌ను కలిసి తన వద్ద ఉన్న ఆధారాలు అందజేశానని, న్యాయస్థానంలోనూ కేసు దాఖలు చేసినట్లు తెలిపారు. మహిళా వ్యాపారులను ప్రోత్సహించాల్సిన సమయంలో ఇలాంటి వేధింపులకు గురిచేయడం బాధాకరమని, తన హక్కుల పరిరక్షణ కోసం చట్టపరంగా పోరాటం కొనసాగిస్తానని హరిత గోగినేని స్పష్టం చేశారు.