BREAKING
బ్యాటింగ్‌లోనూ అర్షదీప్ సింగ్ మెరుపులు.. న్యూజిలాండ్ వన్డేలో అరుదైన రికార్డులు గ్రామ దేవతల దేవాలయంలో ఏక హోమం సంగం మసీదు సెంటర్‌లో పోలీసుల కార్డన్ సెర్చ్ పెద్దపంజాణిలో సర్పంచులకు 15 వార్డులకు 5 నామినేషన్లు సంగం మసీదు సెంటర్‌లో పోలీసుల కార్డన్ సెర్చ్ "నీచ వ్యాఖ్యల పై మౌనమెందుకు - కాకాణి పూజిత" జపాన్ మాస్టర్స్ టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించిన లక్ష్యసేన్.. హోరాహోరీ ఫైనల్‌లో కోకి వాటనాబేపై ఘన విజయం సర్పంచ్ కు 24, వార్డు మెంబర్లకు 74 నామినేషన్లు నెల్లూరు వీపీఆర్ నివాసంలో ఘనంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి జన్మదిన వేడుకలు లీజ్‌ ఒప్పందం పేరుతో అదనపు నగదు డిమాండ్‌.. మహిళా వ్యాపారికి బెదిరింపులు ఓటీటీలోకి వచ్చేస్తున్న అనుపమ పరమేశ్వరన్ 'క్రేజీ కల్యాణం'.. ఆహాలో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ కొమ్మర గ్రామవాసి ఇరగవరంలో అదృశ్యం మౌనికశ్రీ అకాడమీ విద్యార్థులకు కె.బి.ఆర్ ప్రతిభా పురస్కారములు దక్షిణ చైనా సముద్ర ప్రవర్తనా నియమావళిపై ఆసియా-చైనా చర్చల్లో ప్రతిష్టంభన జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో పుస్తక ప్రదర్శన

ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం… ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

Select Suryaa Now
ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం…    ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
సూర్య జగిత్యాల ప్రతినిధి ;ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం అవుతుందని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు.  జగిత్యాల రూరల్ మండలం సంగంపల్లి గ్రామానికి చెందిన నేరెల్ల కవిత – స్వామి దంపతుల ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై, నూతన గృహాన్ని ప్రారంభించి, దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ  ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది అన్నారు. పేద ప్రజల ఆత్మగౌరవం, భద్రత, భరోసా. ఎండకు, వానకు, చలికి ఇబ్బందులు పడుతూ గుడిసెల్లో జీవించే నిరుపేదలకు ఒక పక్కా ఇల్లు నిర్మించుకోవాలనే కల సాకారం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు పథకం అన్నారు. ఆ కలను నిజం చేయాలనే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తీసుకొచ్చింది. ఇప్పటికే గోడలు, పునాదులు బలంగా ఉండి, ఆర్థిక పరిస్థితులు అనుకూలించక రేకుల పైకప్పులు తో నివసిస్తున్న పేద కుటుంబాల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా రూఫ్ రీప్లేస్‌మెంట్ పథకాన్ని తీసుకొచ్చింది. అర్హత కలిగిన కుటుంబాలకు పాత పైకప్పు స్థానంలో పక్కా ఆర్‌సీసీ స్లాబ్ నిర్మించుకునేందుకు రూ.2 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించనుంది అని అన్నారు.జగిత్యాల నియోజకవర్గానికి 500 రూఫ్ రీప్లేస్మెంట్ మంజూరు అయ్యాయి అని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో ఏ పేద కుటుంబం కూడా గుడిసెల్లో ఉండకూడదు. ప్రతి నిరుపేద కుటుంబానికి సురక్షితమైన ఇల్లు ఉండాలి అని ముఖ్య మంత్రి గారి ప్రధాన లక్ష్యం.రెండవ విడత ఇందిరమ్మ ఇళ్లు అతి త్వరలో మంజూరు చేస్తాం అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గడ్డం నారాయణ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బలముకుందాం  మాజీ సర్పంచ్ అంజయ్య, సర్పంచ్ లు అంకతి మల్లయ్య, పరశురామ్ గౌడ్, మల్లేష్,సింగం శ్రీనివాస్, నాగపూషణం తదితర నాయకులు పాల్గొన్నారు.