జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు సాల్వీడ్ విద్యార్థిని లావణ్య ఎంపిక
కుల్కచర్ల, మేజర్ న్యూస్:జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు కుల్కచర్ల మండలం సాల్వీడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని కాట్రావత్ లావణ్య ఎంపికైనట్లు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు కేశవులు తెలిపారు. ఈ నెల 13, 14, 15 తేదీల్లో సంగారెడ్డి జిల్లా దౌల్తాబాద్ గ్రామంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్-14 బాలికల వాలీబాల్ పోటీల్లో లావణ్య ప్రతిభ కనబరిచి తెలంగాణ రాష్ట్ర జట్టు తరఫున జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. ఈ నెల 22వ తేదీ నుంచి మహారాష్ట్రలోని షిరిడీలో జరగనున్న జాతీయ స్థాయి వాలీబాల్ పోటీల్లో లావణ్య తెలంగాణ రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించనుంది. విద్యార్థిని లావణ్య జాతీయ స్థాయికి ఎంపిక కావడం పట్ల వికారాబాద్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఖాజా సంతోషం వ్యక్తం చేశారు.