andhrapradesh
ప్రపంచ స్థాయి క్యాన్సర్ వైద్యం పేదలకు అందుబాటులో తేవడమే మా లక్ష్యం.
పెదకాకాని న్యూస్: ప్రపంచస్థాయి క్యాన్సర్ వైద్య సేవలు పేదలకు అందుబాటులోకి తేవడమే తమ ప్రధాన లక్ష్యమని పెదకాకాని మండల పరిధిలోని తక్కెళ్ళపాడు గ్రామంలో 16వ నెంబర్ జాతీయ రహదారికి సమీపంలో ఉన్న కిమ్స్ చక్ర క్యాన్సర్ సెంటర్ వైద్య నిపుణులు డాక్టర్ రాము కందుల, డాక్టర్ టి మహంతి, డాక్టర్ ప్రణీత్ పేర్కొన్నారు. ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో క్యాన్సర్ వైద్యం నిపుణులు మాట్లాడుతూ దేశంలో ఏటా 14 లక్షలకు పైగా కొత్త కేసులు.. 9 లక్షలకు పైగా మరణాలతో క్యాన్సర్ ప్రమాద స్థాయి ఘంటికలు మోగిస్తుందని ప్రతి 5గురి క్యాన్సర్ రోగుల్లో ముగ్గురు మరణిస్తున్నారని, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్-ఐసిఎంఆర్ పేర్కొంటుందని అన్నారు. వ్యాధి ముదిరిన తర్వాత ఆస్పత్రికి వస్తే పేదలకు క్యాన్సర్ చికిత్స భారం అవుతుందని వారు పేర్కొన్నారు. తొలిదశలోనే గుర్తించటం, సత్వర చికిత్సలతో మూడింట ఒక వంతు క్యాన్సర్ మరణాలు తగ్గించవచ్చు అన్నారు. క్యాన్సర్ ను తొలి దశలో గుర్తిస్తే 90 శాతం క్యూరబుల్, ఇంటర్మీడియట్ స్థాయిలో గుర్తిస్తే లైఫ్ స్పాన్ గణనీయంగా పెంచవచ్చు అన్నారు. ఈ వ్యాధి ప్రభావం జనాభా ప్రాతిపదికను కూడా ఎక్కువగా ఉంటుందని, క్యాన్సర్ పై యుద్ధం ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ యుద్ధంలో తప్పక విజయం సాధించగలం. ఈ యుద్ధంలో జయించాలంటే ఈ వ్యాధి పట్ల ఎవర్నెస్, ప్రివెన్షన్, డయాగ్నస్, డిటెక్షన్, స్క్రీనింగ్, ట్రీట్మెంట్ ముఖ్యమన్నారు. క్యాన్సర్ వ్యాధి నయం చేయడానికి ప్రపంచంలో ఉన్న అన్ని చికిత్సలు భారతదేశంలో అందుబాటులోనే ఉన్నాయి తొలి దశలో బ్రెస్ట్ క్యాన్సర్ క్యూరబల్, తొలి దశలో లంగ్ క్యాన్సర్ క్యూరబుల్, తొలిదశలో టంగ్ క్యాన్సర్ క్యూరబుల్, తొలిదశలో ప్రోస్టేట్ క్యాన్సర్ క్యూరబుల్ ఇలా అద్భుతమైన వైద్యం అందుబాటులో ఉందన్నారు. పూర్వం బ్రెస్ట్ క్యాన్సర్ మహిళల్లో 60 నుంచి 80 సంవత్సరాల లోపు వారికి ఎక్కువగా కనిపించేది. ప్రస్తుతం 30 నుంచి 40 సంవత్సరాల వారికి కూడా రొమ్ము క్యాన్సర్ వస్తుంది. పురుషుల్లో నోరు గొంతు క్యాన్సర్ లతోపాటు లంగ్ , ప్రోస్టేట్ క్యాన్సర్లు ఆందోళన రీతిలో కనిపిస్తున్నాయన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా అత్యంత ఖరీదైన క్యాన్సర్ వైద్యం అందుబాటులో ఉండాలని నేపథ్యంతో గ్రామీణ ప్రాంతమైన పెదకాకాని మండలం తక్కెళ్ళపాడు గ్రామం నందు కిమ్స్ చక్ర క్యాన్సర్ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని క్యాన్సర్ నివారణకు ఆసుపత్రి తరపున అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఇప్పటివరకు వందకు పైగా నిర్వహించి మహిళల్లో రొమ్ము క్యాన్సర్ గర్భాశయ ముఖ క్యాన్సర్ సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్ లు, పురుషుల్లో ప్రోస్ట్రేట్ క్యాన్సర్ కు సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్ లు చేయడం జరిగింది. ప్రతి గ్రామంలో స్క్రీనింగ్ టెస్ట్ లు నిర్వహించి ప్రజల ఆరోగ్యాన్ని వారికి తెలియపరుస్తూ తీసుకోవలసిన ముందు జాగ్రత్తలను వివరిస్తున్నాం. కిమ్స్ చక్ర క్యాన్సర్ సెంటర్ ఆసుపత్రి నందు అనుభవజ్ఞులైన మెడికల్, సర్జికల్, రేడియేషన్ ఆంకాలజిస్టులు హెమటాలజీ, బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ నిపుణులు, న్యూక్లియర్ మెడిసిన్, ఇంటర్వెన్షనల్ రేడియాలజీ, ఆంకోపాథాలజీ సేవలు నైపుణ్యం కలిగిన నర్సింగ్ సహాయక సిబ్బంది. క్లినికల్ ట్రయల్స్ అధునాతన వైద్య విధానాలు అందుబాటులో ఉన్నాయి. 200 పడకల సామర్థ్యం, రేడియోథెరపీ, డిజిటల్ పిఈటి -సిటీ , బోన్ మేరో ట్రాన్స్‌ప్లాంట్ యూనిట్ అందుబాటులో ఉన్నాయి. క్యాన్సర్ క్రిటికల్ కేర్ సెంటర్ క్యాన్సర్ ఎమర్జెన్సీ సెంటర్ రీసెర్చ్ విభాగం అందుబాటులో ఉన్నాయన్నారు. క్యాన్సర్ వస్తే ప్రాణాలు పోతాయనే అపోహను వీడాలని, తొలి దశలోనే గుర్తిస్తే క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేయవచ్చు. భారతదేశంలో వచ్చే క్యాన్సర్లలో సుమారు 60% వరకు ముందుస్తు జాగ్రత్తలతో, జీవనశైలి మార్పులతో నివారించవచ్చు. పొగత్రాగడం, గుట్కా, తంబాకు సేవించడం వంటి అలవాట్లు నోటి, గొంతు, క్యాన్సర్లకు ప్రధాన కారణం వీటికి దూరంగా ఉండాలి. సెర్వికల్ క్యాన్సర్ (గర్భాశయ ముఖద్వార క్యాన్సర్) రాకుండా హెచ్‌పీవీ టీకాలను వేసుకోవడం చాలా ముఖ్యం. శరీరంలో వచ్చే చిన్న చిన్న మార్పులను లేదా లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరీక్షలు చేయించుకోవాలని క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ రాము కందుల, డాక్టర్ టి మహంతి, డాక్టర్ ప్రణీత్ సూచించారు.