నెల్లూరు వీపీఆర్ నివాసంలో ఘనంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి జన్మదిన వేడుకలు
నెల్లూరు, మేజర్ న్యూస్ : కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి జన్మదిన వేడుకలు నెల్లూరులో అత్యంత ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి నివాసంలో జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ, టీడీపీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్, నెల్లూరు కార్పొరేషన్ చైర్మన్ రూప్ కుమార్ యాదవ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఛైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్, రాష్ట్ర ఆర్యవైశ్య సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ దుండి రాకేష్ తదితర ముఖ్య నేతలు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చేత కేక్ కటింగ్ చేయించి, పుష్పగుచ్ఛాలు అందించి ఘనంగా సత్కరించారు. నియోజకవర్గ అభివృద్ధిలో మరింత ముందుకెళ్లాలని, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షిస్తూ నాయకులందరూ ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో పలువురు టీడీపీ ముఖ్య నాయకులు, అభిమానులు పాల్గొన్నారు..