andhrapradesh
ఘనంగా పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ వార్షికోత్సవం
తెనాలి న్యూస్ పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ వార్షికోత్సవ కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఇటీవల జరిగినఎన్నికలలో గెలుపొందిన పద్మశాలి ప్రతినిధులని ఘనంగా సత్కరించారు. తెనాలి పట్టణ 21వ వార్డు కౌన్సిలర్ దివి అనిత, 23 వ వార్డుకౌన్సిలర్ గుంటిధనలక్ష్మి, జగడగుంటపాలెం ఎంపీటీసీ సభ్యులు గోలి శ్రీనివాసరావు అభినందన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం 250 మంది పేద మహిళలకు దుప్పట్ల పంపిణీ చేశారు. సొసైటీ అధ్యక్షులు జొన్నాదుల నరసింహారావు అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా డిప్యూటీ సెక్రటరీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దామర్ల శ్రీనివాసరావు పాల్గొన్నారు. పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నాదుల మహేష్, సొసైటీ ప్రధాన సలహాదారు రాచాబత్తుని శ్రీనివాసరావు తదితరులు ప్రసంగిస్తూ పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ గత 30 ఏళ్లుగా పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ ని ర్వహించిన అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని చెప్పారు. విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్ నోట్ బుక్స్ పంపిణీ క్విజ్ కాంపిటీషన్ నిర్వహణ, గ్రామర్ కోచింగ్ తరగతులు, మెడికల్ క్యాంప్స్ నిర్వహించటం, పద్మశాలి వివాహ పరిచయ వేదిక ఏర్పాటు ద్వారా వధూవరుల తల్లిదండ్రులే స్వయంగా తమ పిల్లలకు సంబంధాలు కుదుర్చుకునే అవకాశం కల్పించిందన్నారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బి జె కె నరేంద్రబాబు, కోశాధికారి దివి పురుషోత్తం, ఉపాధ్యక్షులు దామర్ల పరమేశ్వరరావు, పంచుమర్తి భాస్కరరావు, కార్యదర్శులు గంజి ప్రభాకరరావు, దివి హేమంత్ కుమార్, కటకం శేషగిరి తదితరులు పాల్గొన్నారు.