కరాటే క్రమశిక్షణకు పునాది... -ఆడపిల్లకు ప్రతి ఒక్కరూ తప్పక నేర్చుకోవాలి -ఘనంగా నవీన్ మార్షల్ ఆర్ట్స్ ఆరవ బ్రాంచ్ ప్రారంభం -కామన్ వెల్త్ విజేత సూర్యను శాప్ చైర్మన్ అభినందన
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : కరాటే అనేది పిల్లల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, శారీరక దృఢత్వాన్ని పెంపొందించే గొప్ప విద్య అని శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు అన్నారు. తిరుచానూరులో నవీన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆరవ బ్రాంచ్‌ను ఎడిఫై స్కూల్ అధినేత అధినేత ప్రణీత్ పెనుమాదుతో కలిసి ఆయన ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రవి నాయుడు మాట్లాడుతూ "కరాటే కేవలం క్రీడ కాదు. పిల్లల్లో మానసిక వికాసాన్ని పెంచుతుంది. ప్రతి ఒక్కరూ కరాటే నేర్చుకోవాలి. ముఖ్యంగా ఆడపిల్లలు ఆత్మరక్షణ విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. సెల్ఫ్ డిఫెన్స్ లో నైపుణ్యంతో ధైర్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
కామన్ వెల్త్ విజేతకు అభినందన…
ఈ సందర్భంగా స్కాట్లాండ్ గ్లాస్గోలో జరిగిన 12వ కామన్ వెల్త్ కరాటే ఛాంపియన్‌షిప్-2026లో కాంస్య పతకం సాధించి తిరుపతికి గర్వకారణంగా నిలిచిన ఎన్ఎంఏ విద్యార్థి విద్యార్థి ఎన్.సూర్యను శాప్ చైర్మన్ ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎన్ఎంఏ అధినేత డాక్టర్ పులిచెర్ల నవీన్, తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం చైర్మన్ మహేష్ యాదవ్, కోచ్‌లు, క్రీడాకారులు పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్