BREAKING
రామగిరి పంచాయతీ టిడిపి అభ్యర్థిగా బెస్త ఆదిలక్ష్మి శ్రీనివాసులు!!! పుట్లగట్లగూడెం సర్పంచ్ అభ్యర్థిగా మల్లిపూడి రవి నామినేషన్ తాడికొండ 220కేవీ సబ్ స్టేషన్ నో సందర్శించిన జెసి. సిరాజ్ మ్యాజిక్ డెలివరీ.. ఫిన్ అలెన్ వికెట్ నేలకూల్చిన భారత పేసర్ గుర్తింపు' ఎప్పుడు... గోవిందా....! -టీటీడీలో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులపై కనికరం చూపండి సారూ... -ఐడీ కార్డులు, మెడికల్, లడ్డుకార్డుల జారీలో జాప్యమెందుకో... -పాలకమండలి నిర్ణయించినా అమలు చేయడంలో నిర్లక్ష్యమా...! శ్రీకాళహస్తి పురపాలక సంఘం తెలుగుదేశం పార్టీ చైర్మన్ అభ్యర్థిగా పేట బాలాజీ రెడ్డి బిజెపి ఎస్టి మోర్చా ఆధ్వర్యంలో ఘనంగా బిర్సా ముండా జయంతి వేడుకలు.... నిండుకుండలా ఎల్ ఎన్ డి పేట రిజర్వాయర్ --180 క్యూసెక్కులు దిగువకు విడుదల పురాతన ఆలయాకృతికి పూర్వవైభవం తీసుకురావాలి..! -- ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి వన్డేల్లో జో రూట్ అరుదైన మైలురాయి.. ఇంగ్లండ్ తరఫున యాభై అర్ధశతకాలు పూర్తి ముత్యాలమ్మ దేవత నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలకు ఎమ్మెల్యే ఎలేటి మహేశ్వర్ రెడ్డికి ఆహ్వానం. : కొనసాగుతున్న గ్రంధాలయ వారోత్సవాలు కరాటే క్రమశిక్షణకు పునాది... -ఆడపిల్లకు ప్రతి ఒక్కరూ తప్పక నేర్చుకోవాలి -ఘనంగా నవీన్ మార్షల్ ఆర్ట్స్ ఆరవ బ్రాంచ్ ప్రారంభం -కామన్ వెల్త్ విజేత సూర్యను శాప్ చైర్మన్ అభినందన డయాబెటిస్‌పై నిర్లక్ష్యం వద్దు..ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి ఎమ్మెల్యే గళ్ళా మాధవి *యాసంగి సాగులో పంటల మార్పిడికి రైతులు సహకరించాలి – రైతువారీ వివరాలను క్రాప్ డేటా పోర్టల్‌లో నమోదు చేయించుకోవాలి ఏఓ సతీష్

*యాసంగి సాగులో పంటల మార్పిడికి రైతులు సహకరించాలి – రైతువారీ వివరాలను క్రాప్ డేటా పోర్టల్‌లో నమోదు చేయించుకోవాలి ఏఓ సతీష్

Select Suryaa Now
*యాసంగి సాగులో పంటల మార్పిడికి రైతులు సహకరించాలి – రైతువారీ వివరాలను క్రాప్ డేటా పోర్టల్‌లో నమోదు చేయించుకోవాలి ఏఓ సతీష్

కోహెడ రాబోయే యాసంగి 2026–27 సీజన్‌లో ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం మరియు భూగర్భ జలమట్టాలు తగ్గే పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు పంటల మార్పిడికి ప్రాధాన్యత ఇవ్వాలని కొహెడ మండల వ్యవసాయ అధికారి సతీష్ ఒక ప్రకటనలో కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యాసంగి సీజన్‌లో వరి సాగుకు బదులుగా తక్కువ నీటి అవసరమయ్యే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు. ప్రతి గ్రామంలో వరి సాగు విస్తీర్ణంలో కనీసం 25 శాతం విస్తీర్ణాన్ని పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాలు, కూరగాయలు మరియు ఇతర అనువైన ఉద్యాన, ఆయిల్ ఫామ్ పంటల సాగుకు మళ్లించాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా నిర్ణయించిందని తెలిపారు. రైతులు తమ భూముల స్వభావం, నీటి లభ్యతను బట్టి శనగ, కంది, పెసర, మినుము, జొన్న, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, నువ్వులు, వేరుశనగ తదితర పంటలను సాగు చేయడానికి ముందుకు రావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి రైతు యాసంగిలో సాగు చేయదలచిన పంట, పంట విస్తీర్ణం, పంట రకం, పంట మార్పిడికి కావలసిన సదుపాయాలు మరియు తదితర వివరాలను సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈఓలు) సేకరించి క్రాప్ డేటా పోర్టల్‌లో రైతువారీగా నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. కావున కొహెడ మండలంలోని రైతులందరూ తమ గ్రామానికి సంబంధించిన ఏఈఓలను వెంటనే సంప్రదించి, పంటల మార్పిడికి సంబంధించిన వివరాలను అందించి, క్రాప్ డేటా పోర్టల్‌లో నమోదు చేయించుకోవాలని సూచించారు.
రైతువారీ వివరాల నమోదు ప్రక్రియను 16.11.2026, సోమవారం సాయంత్రంలోగా పూర్తి చేయాల్సి ఉన్నందున రైతులు గడువులోగా ఏఈఓ లకు సహకరించాలని కోరారు.
నీటి వనరులను సంరక్షించుకోవడం, కరువు పరిస్థితుల్లో పంట నష్టాలను తగ్గించుకోవడం మరియు రైతుల ఆదాయాన్ని కాపాడుకోవడంలో పంటల మార్పిడి ఎంతో కీలకమని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి రైతులు, గ్రామ సర్పంచులు మరియు ఇతర ప్రజాప్రతినిధులు వ్యవసాయ శాఖకు సహకరించాలని మండల వ్యవసాయ అధికారి విజ్ఞప్తి చేశారు.