BREAKING
*యాసంగి సాగులో పంటల మార్పిడికి రైతులు సహకరించాలి – రైతువారీ వివరాలను క్రాప్ డేటా పోర్టల్‌లో నమోదు చేయించుకోవాలి ఏఓ సతీష్ భీమవరం మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా డాక్టర్ చుండూరి మల్లేశ్వరి చైర్మన్ అభ్యర్థిత్వంపై పలువురి పేర్లు ప్రచారంలోకి.. చివరకు వైద్యురాలికి జనసేన అధిష్టానం అవకాశం కవిత్వం రాయడం ఓ తపస్సు ,అమరావతి సాహితీ మిత్రులు సభలో డా. రావి రంగారావు న్యూజిలాండ్ గడ్డపై టీమిండియా చరిత్ర.. ఒకే పర్యటనలో వన్డే, టీ20 సిరీస్‌లు కైవసం 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో " పుస్తక ప్రదర్శన " కీసరలో అమోర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం.. 300 మందికి పైగా వైద్య పరీక్షలు సేవ సమాజానికి స్ఫూర్తి...! -విశిష్ట సేవలందించిన వారికి సూర్యచంద్ర ఫౌండేషన్ పురస్కారాలు -అంకితభావంతో పనిచేసే వారికి గుర్తింపునివ్వడం అభినందనీయం : విసి ఉమ ఘనంగా పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ వార్షికోత్సవం పుస్తక పఠనంతోనే విజ్ఞానం వికాసం - గ్రంథాలయ అధికారి రాకేష్ అరంగేట్ర టెస్టు తొలి బంతికే అవుట్.. మహ్ఫిజుల్ ఇస్లామ్‌కు చేదు అనుభవం, రబాడ అరుదైన రికార్డు శ్రీకాళహస్తి పురపాలక సంఘం వైయస్సార్ పార్టీ చైర్మన్ అభ్యర్థిగా జ్ఞానాంబ గారి మధు రెడ్డి జనసేనలో కష్టపడిన కార్యకర్తకు గుర్తింపు కరువేనా? వలస కమలాదేవి మంచికి మారుపేరు వారిసేవలను గుర్తిస్తూ ఘనమైన నివాళులర్పించిన కూరెళ్ళ గ్రామ సర్పంచ్ బండారు లక్ష్మి బాలరాజు గ్రామ ప్రజలు న్యూజిలాండ్‌పై థ్రిల్లింగ్ విక్టరీ.. 3-1 తేడాతో వన్డే సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా నేడే రామాలయంలో కార్తీక్ సోమవారాల వ్రతం

జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో పుస్తక ప్రదర్శన

Select Suryaa Now
జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో పుస్తక ప్రదర్శన
సూర్య జగిత్యాల ప్రతినిధి ;;జిల్లా గ్రంథాలయ సంస్థ వారి ఆధ్వర్యంలో ఆదివారం  జగిత్యాలలో పుస్తక ప్రదర్శన కార్యక్రమంతో పాటు, విద్యార్థిని విద్యార్థులకు ప్రత్యేకంగా మెమొరీ టెస్ట్ (జ్ఞాపకశక్తి పరీక్ష) పోటీలను అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్  సంగనబట్ల దినేష్  ముఖ్య అతిథిగా విచ్చేసి, జ్యోతి ప్రజ్వలన గావించి, రిబ్బన్ కత్తిరించి పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు.​ఈ సందర్భంగా చైర్మన్ సంగనబట్ల దినేష్ విద్యార్థులను ఉద్దేశించి పుస్తక పఠన ప్రాముఖ్యత గురించి అద్భుతంగా ప్రసంగించారు. విద్యార్థులు పాఠశాల పాఠ్యపుస్తకాలతో పాటు వైవిధ్యభరితమైన గ్రంథాలయ పుస్తకాలను చదవడం అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. పుస్తక పఠనం మనుషుల ఆలోచనా విధానాన్ని మారుస్తుందని, విద్యార్థులలో సృజనాత్మకతను, జ్ఞాపకశక్తిని పెంపొందించడంలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు చిన్న వయస్సు నుంచే పుస్తకాలను నేస్తాలుగా మలుచుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో లైబ్రేరియన్  కటకం సంజీవ రెడ్డి, గ్రంథపాలకులు జె. వసంత్, కె. మల్లయ్య, సగ్గు కృష్ణ, స్వామి, రాజు  ఉపాధ్యాయినీలు,అనిత, జమున రాణి, చందన, తరంగిణి పాల్గొన్నారు. 
​ఈ పుస్తక ప్రదర్శన  మెమొరీ టెస్ట్ కార్యక్రమానికి పాఠకులు, భారీ సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహంగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.