శ్రీకాళహస్తి పురపాలక సంఘం వైయస్సార్ పార్టీ చైర్మన్ అభ్యర్థిగా జ్ఞానాంబ గారి మధు రెడ్డి
శ్రీకాళహస్తి పట్టణం పురపాలక సంఘం వైయస్సార్ పార్టీ చైర్మన్ అభ్యర్థిలగా జ్ఞానాంబ గారి మధు రెడ్డి నామినేషన్.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణం పురపాలక సంఘం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థిలగా వైయస్సార్ పార్టీ సీనియర్ నేత జ్ఞానాంబ గారి మధు, అడ్వకేట్ లక్ష్మీపతి ఆదివారం నామినేషన్ వేయడం జరిగింది. శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆదేశాలతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమక్షంలో నామినేషన్ వేయడం జరిగింది. శ్రీకాళహస్తి పట్టణం పల్లె రెడ్లు కమ్యూనిటీకి చెందిన నేత జ్ఞానాంబ మధు రెడ్డి రాజకీయంగా పలుకుబడి కలిగిన నాయకులు, రాజకీయంగా పట్టు ఉన్న వ్యక్తి, వైయస్సార్ పార్టీ అభివృద్ధికి పాటు పడుతూ అంకితభావంతో పనిచేస్తున్నారు. శ్రీకాళహస్తి పట్టణంలో అన్ని వర్గాల ప్రజలతో, మంచి సత్సంబంధాలు కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. వీసీ వెంకటయ్య సూర్య దినపత్రిక ఇన్చార్జి శ్రీకాళహస్తి