భీమవరం మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా డాక్టర్ చుండూరి మల్లేశ్వరి చైర్మన్ అభ్యర్థిత్వంపై పలువురి పేర్లు ప్రచారంలోకి.. చివరకు వైద్యురాలికి జనసేన అధిష్టానం అవకాశం
భీమవరం, మేజర్ న్యూస్: భీమవరం మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి ఎంపికపై కొద్దిరోజులుగా సాగుతున్న ఉత్కంఠకు జనసేన అధిష్టానం తెరదించింది. చైర్మన్ అభ్యర్థిగా ప్రముఖ వైద్యురాలు డాక్టర్ చుండూరి మల్లేశ్వరిని ఖరారు చేసింది. ఆదివారం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.
చైర్‌పర్సన్ అభ్యర్థిత్వం కోసం స్థానికంగా పలువురి పేర్లు ప్రచారంలోకి రావడంతో ఎవరికి అవకాశం దక్కుతుందనే ఆసక్తి నెలకొంది. చివరకు వైద్యరంగంలో 35 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న డాక్టర్ మల్లేశ్వరికి పార్టీ అధిష్టానం అవకాశం కల్పించింది.
భీమవరంలోని శ్రీ వెంకటేశ్వర ఆసుపత్రి, మిత్ర మెడికేర్ ఆసుపత్రి ద్వారా వైద్య సేవలందిస్తూ ఆమె ప్రత్యేక గుర్తింపు పొందారు. 2018లో పవన్ కళ్యాణ్ చేపట్టిన పోరాట యాత్ర సమయంలో జనసేనతో అనుబంధం ఏర్పరచుకుని పార్టీ కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు.
భీమవరం మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా జనసేన బరిలోకి దిగుతున్న నేపథ్యంలో డాక్టర్ మల్లేశ్వరి అభ్యర్థిత్వం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
కాగా, కాకినాడ మేయర్‌గా ఆకుల భవాని, శ్రీకాకుళం మేయర్‌గా దానేటి రాధారాణి, తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్‌గా పాలూరు వెంకటేశ్వరరావు, రాజాం చైర్‌పర్సన్‌గా బనిశెట్టి సౌజన్యలత పేర్లను కూడా జనసేన ప్రకటించింది.