కేటీఆర్‌ను కలిసిన కీసర బీఆర్‌ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు చినింగని బాల్‌రాజ్
కీసర,మేజర్ న్యూస్:తిమ్మాయి పల్లి గ్రామనికి విచ్చేసిన రాష్ట్ర బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను కీసర బీఆర్‌ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు చినింగని బాల్‌రాజ్ మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులు, కీసర మండలంలో బీఆర్‌ఎస్ పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యాచరణ, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకలాపాలు, ప్రజల సమస్యలు, పార్టీ శ్రేణుల పనితీరుపై కూడా చర్చించారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… పార్టీ కోసం నిబద్ధతతో, కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు భవిష్యత్తులో తగిన గుర్తింపు, ప్రాధాన్యత ఉంటుందని భరోసా ఇచ్చినట్లు చినింగని బాల్‌రాజ్ వెల్లడించారు. కార్యకర్తల కృషిని పార్టీ ఎప్పటికీ గుర్తిస్తుందని, పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజల్లో ఉండాలని సూచించారని కేటీఆర్‌తో జరిగిన సమావేశం సంతృప్తినిచ్చిందని అన్నారు.