సర్పంచ్ కు 24, వార్డు మెంబర్లకు 74 నామినేషన్లు
నర్సాపురం రూరల్, మేజర్ న్యూస్ :ఈ నెల 15 నుండి 17 వరకు గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డ్ మెంబర్ పదవులకు నామినేషన్లను స్వీకరిస్తున్నారు. దీనిలో భాగంగా మొదటి రోజు ఆదివారం సర్పంచ్ పదవులకు 24 మంది నామినేషన్లు వేశారు. వార్డు మెంబర్ పదవులకు 74 మంది నామినేషన్లు వేసినట్లు ఎంపీడీవో ఎం నాసర్ రెడ్డి తెలిపారు. సర్పంచ్ పదవులకు చామకూరపాలెం నుండి 3, చిట్టవరం 1, లక్ష్మణేశ్వరం5, లికితపూడి 3, ఎల్బీచర్ల 1, మల్లవరం3, మల్లవరం లంక 1, మర్రితిప్ప 4, పసలదీవి2, రుస్తుం బాధ 1 నామినేషన్లు దాఖలు అయినట్లు ఆయన తెలిపారు.