పెద్దపంజాణిలో సర్పంచులకు 15 వార్డులకు 5 నామినేషన్లు
చిత్తూరు జిల్లా పెద్దపంజాణి
గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో, పెద్దపంజాణి మండలంలోని మొత్తం 25 గ్రామ పంచాయతీలు మరియు 248 వార్డులకు గాను 6 క్లస్టర్ కేంద్రాలలో తొలిరోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. తొలిరోజు 25 సర్పంచ్ స్థానాలకు 15 , 248 వార్డులకు గాను 5 నామినేషన్లు దాఖలయ్యాయి. కరసనపల్లె మరియు పెద్దరికుంట పంచాయతీలకు 4 చొప్పున, శంకరాయల పేట, నిడిగుంట, అప్పినపల్లె, రాజుపల్లి, పెద్దవెలగటూరు, పెద్దపంజాణి, ముత్తుకూరు పంచాయతీలకు 1 చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. మిగిలిన 16 పంచాయతీలకు తొలిరోజు సర్పంచ్ నామినేషన్లు దాఖలు కాలేదు. మండలంలోని 6 క్లస్టర్ కేంద్రాలలో 5 కేంద్రాలలో పెద్దకాపల్లె, నాగిరెడ్డిపల్లి, వీరప్పల్లె, కోగిలేరు, రాయలపేట గ్రామ పంచాయతీలకు తొలిరోజు సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఎటువంటి నామినేషన్లు దాఖలు కాలేదు.
ఏం సుబ్రహ్మణ్యం రెడ్డి ,రిపోర్టర్ పెద్దపంజాణి