బిర్సా ముండా ఆశయాలతో వికసిత్ భారత్‌కు అడుగులు వేయాలి: ప్రధాని మోదీ. :
సూర్య, నిర్మల్ జిల్లా ప్రతినిధి. :
స్వాతంత్ర్య సమరయోధుడు భగవాన్ బిర్సా ముండాను ఆదర్శంగా తీసుకొని వికసిత్ భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. బిర్సా ముండా జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన జన్ జాతీయ గౌరవ దివస్ వేడుకల్లో జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారులు కలెక్టరేట్ నుంచి వర్చువల్‌గా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవం, అభివృద్ధి కోసం బిర్సా ముండా చేసిన పోరాటం చిరస్మరణీయమని, కేంద్ర ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి పలు పథకాలు అమలు చేస్తోందని తెలిపారు.
అనంతరం కలెక్టరేట్‌లో బిర్సా ముండా చిత్రపటానికి జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి నిహారిక, అధికారులు, ఆదివాసీ సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బిర్సా ముండా పోరాట స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని నిహారిక సూచించారు. కార్యక్రమంలో గిరిజన సంఘాల నాయకులు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.