ఏకగ్రీవ పంచాయతీలతో దివిసీమ గ్రామాల అభివృద్ధికి బాటలు
అవనిగడ్డ, మేజర్ న్యూస్: గ్రామాల్లో ఐక్యత, ఆత్మీయత పెంపొందించడంతో పాటు సమష్టి కృషితో ప్రతి ఒక్కరి అభివృద్ధికి ఏకగ్రీవ పంచాయతీలు దోహదపడతాయని బీజేపీ కౌలు రైతుల రాష్ట్ర కన్వీనర్ జీవీ నాగరాయలు అన్నారు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యే గ్రామ పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించడం గ్రామాభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
5000 లోపు జనాభా ఉన్న గ్రామాలకు రూ.15 లక్షలు, 5 వేల నుంచి 10 వేల వరకు జనాభా ఉన్న గ్రామాలకు రూ.25 లక్షలు, 10 వేలకుపైగా జనాభా ఉన్న గ్రామాలకు రూ.50 లక్షలు ప్రభుత్వం కేటాయిస్తోందని తెలిపారు. ఈ నిధులను గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించుకోవచ్చన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షిస్తున్న 2047 వికసిత్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా దివిసీమ గ్రామాలు కూడా అభివృద్ధి పథంలో ముందుకు సాగేందుకు ఏకగ్రీవ పంచాయతీలు దోహదపడతాయని నాయకులు అభిప్రాయపడ్డారు.
ఈ కర్యక్రమంలో టీడీపీ అవనిగడ్డ మండల పార్టి అధ్యక్షుడు యాసం చిట్టిబాబు, జనసేన మండలపార్టీ అధ్యక్షుడు గుడివాక శేషుబాబు, శ్రీరామ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షుడు తోట శ్యామ్ కిషోర్ నాయుడు, బీజేపీ సీనియర్ నాయకులు పరిమిశెట్టి ప్రభాకర్, అల్లూరి శివ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
అజంత శ్రీనివాస్, అవనిగడ్డ, కృష్ణాజిల్లా.