పుస్తక ప్రదర్శనను ప్రారంభించిన ఉమ్మడి నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ శ్రీమతి మేకపాటి శాంతి కుమారి
నెల్లూరు, మేజర్ న్యూస్ : 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా రెండవరోజు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శన కార్యక్రమాన్ని ఉమ్మడి నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ శ్రీమతి మేకపాటి శాంతి కుమారి ప్రారంభించారు. వీరితోపాటు తెలుగు భాషోద్యమసమితి, నెల్లూరు జిల్లా అధ్యక్షులు,,రచయిత మరియుఅనువాదకులు శ్రీ చెలం చర్ల భాస్కరరెడ్డి రిటైర్డ్ తహసీల్దార్ మరియు రచయిత శ్రీ పోట్లూరిసుబ్రహ్మణ్యంగారు ప్రజాసైన్స్ నెల్లూరు పట్టణ అధ్యక్షులు శ్రీ ఎమ్. సతీష్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా గ్రంధాల సంస్థ చైర్ పర్సన్ శ్రీమతి మేకపాటి శాంతి కుమారి మాట్లాడుతూ జ్ఞాన్యాన్ని పెంపొందించుకోవడం, మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తి లాగా సమాజంలో మెలగాలి అంటే తప్పనిసరిగా పుస్తకాలు చదవాలని తెలిపారు. ప్రతి సంవత్సరం గ్రంథాలయ వేదికగా జరుగుతున్న వారోత్సవాలు ప్రజలందరికీ గ్రంధాలయాల ఆవశ్యకత, పుస్తకం యొక్క గొప్పతనం వివరించడం జరుగుతుందని తెలిపారు. నేటి యువత,విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకొని, పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సెక్రెటరీ కుమార్ రాజా, గ్రంధాలయ సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు, పాఠకులు తదితరులు పాల్గొన్నారు.