BREAKING
జపాన్ మాస్టర్స్ టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించిన లక్ష్యసేన్.. హోరాహోరీ ఫైనల్‌లో కోకి వాటనాబేపై ఘన విజయం సర్పంచ్ కు 24, వార్డు మెంబర్లకు 74 నామినేషన్లు నెల్లూరు వీపీఆర్ నివాసంలో ఘనంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి జన్మదిన వేడుకలు లీజ్‌ ఒప్పందం పేరుతో అదనపు నగదు డిమాండ్‌.. మహిళా వ్యాపారికి బెదిరింపులు ఓటీటీలోకి వచ్చేస్తున్న అనుపమ పరమేశ్వరన్ 'క్రేజీ కల్యాణం'.. ఆహాలో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ కొమ్మర గ్రామవాసి ఇరగవరంలో అదృశ్యం మౌనికశ్రీ అకాడమీ విద్యార్థులకు కె.బి.ఆర్ ప్రతిభా పురస్కారములు దక్షిణ చైనా సముద్ర ప్రవర్తనా నియమావళిపై ఆసియా-చైనా చర్చల్లో ప్రతిష్టంభన జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో పుస్తక ప్రదర్శన పడుగుపాడులో టీడీపీలో చేరిన 150 కుటుంబాలు.. తుఫాను వస్తోంది... అప్రమత్తంగా ఉండాలి ఏకగ్రీవ పంచాయతీలతో దివిసీమ గ్రామాల అభివృద్ధికి బాటలు జపాన్ వెకేషన్ ఫోటోలతో విజయ్ దేవరకొండ సందడి.. రష్మిక మందన్నపై ఆసక్తికర క్యాప్షన్లు ప్రభుత్వ మీడియా నిధుల ప్రణాళికను వ్యతిరేకిస్తూ ప్రాగ్‌లో వేలాది మంది చెక్ ప్రజల నిరసనలు కేటీఆర్‌ను కలిసిన కీసర బీఆర్‌ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు చినింగని బాల్‌రాజ్

ఇందుకూరుపేటలో ఖాళీ అవుతున్న వైసీపీ.. టీడీపీలోకి 300 మందికి పైగా చేరిక

Select Suryaa Now
ఇందుకూరుపేటలో ఖాళీ అవుతున్న వైసీపీ.. టీడీపీలోకి 300 మందికి పైగా చేరిక

నెల్లూరు,  మేజర్ న్యూస్ :   ఇందుకూరుపేట మండలంలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మండలంలోని కొత్తూరుకు చెందిన ఎంపీటీసీ సభ్యులు, స్వతంత్ర అభ్యర్థి, వైసీపీ ముఖ్య నాయకులు తమ అనుచరులతో కలిసి ఆదివారం తెలుగుదేశం పార్టీలో చేరారు. నెల్లూరులోని వీపీఆర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కోవూరు శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు వారికి పసుపు కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు మాట్లాడుతూ.. కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి తిరుగులేదని ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ప్రతిపక్ష పార్టీల నాయకులు సైతం తెలుగుదేశంలోకి రావడం మంచి పరిణామమన్నారు. ఇందుకూరుపేట మండలంలో వైసీపీ ఖాళీ అయిందని పేర్కొన్నారు.

పార్టీ బలోపేతానికి సమష్టి కృషి
కొత్తగా చేరిన నాయకులు పార్టీలో ఇప్పటికే ఉన్న నాయకులు, కార్యకర్తలతో సమన్వయంతో కలిసి పనిచేయాలని ఎమ్మెల్యే గారు సూచించారు. కూటమి ప్రభుత్వ పథకాలను ప్రతి గ్రామంలోనూ ప్రజలకు విస్తృతంగా వివరించాలన్నారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి అందరూ సమష్టిగా కృషి చేయాలని, తెలుగుదేశం పార్టీ కోసం బాధ్యతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు. తాను ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటున్నానని, తన వెంట నడిచే ప్రజాప్రతినిధులు, నాయకులు కూడా ప్రజలకు అందుబాటులో ఉండేవారేనని స్పష్టం చేశారు.

టీడీపీలో చేరిన కీలక నాయకులు
ఎంఎస్‌ఎంఈ రాష్ట్ర డైరెక్టర్ వీరేంద్ర నాయుడు, టీడీపీ ముఖ్య నాయకులు కళ్యాణ్ రెడ్డి, ఇందుకూరుపేట మండలాధ్యక్షులు పవన్ కుమార్ రెడ్డి, వేగూరు శివకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది. ఇందుకూరుపేట 2/1 స్వతంత్ర సభ్యులు ఆల్తూరు వెంకట లక్ష్మి, 2/2 ఎంపీటీసీ సభ్యులు భీమవరపు వెంకట కృష్ణారెడ్డి, వైసీపీ నాయకులు గండవరపు రామిరెడ్డి, మద్దాల రమేష్ రెడ్డి, ఈగ విజయమ్మ, మాణిక్యాల నిర్మలమ్మ తమ అనుచరులతో కలిసి పార్టీలో చేరారు. 300 మందికి పైగా అనుచరులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే గారి నాయకత్వంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. ఇప్పటికే ఎమ్మెల్యే గారి సహకారంతో గ్రామాల్లో లక్షలాది రూపాయల నిధులతో పలు అభివృద్ధి పనులు జరిగాయని ఆనందం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ఎమ్మెల్యే గారితో కలిసి పనిచేస్తామని, పార్టీ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని వెల్లడించారు.