BREAKING
జపాన్ మాస్టర్స్ టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించిన లక్ష్యసేన్.. హోరాహోరీ ఫైనల్‌లో కోకి వాటనాబేపై ఘన విజయం సర్పంచ్ కు 24, వార్డు మెంబర్లకు 74 నామినేషన్లు నెల్లూరు వీపీఆర్ నివాసంలో ఘనంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి జన్మదిన వేడుకలు లీజ్‌ ఒప్పందం పేరుతో అదనపు నగదు డిమాండ్‌.. మహిళా వ్యాపారికి బెదిరింపులు ఓటీటీలోకి వచ్చేస్తున్న అనుపమ పరమేశ్వరన్ 'క్రేజీ కల్యాణం'.. ఆహాలో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ కొమ్మర గ్రామవాసి ఇరగవరంలో అదృశ్యం మౌనికశ్రీ అకాడమీ విద్యార్థులకు కె.బి.ఆర్ ప్రతిభా పురస్కారములు దక్షిణ చైనా సముద్ర ప్రవర్తనా నియమావళిపై ఆసియా-చైనా చర్చల్లో ప్రతిష్టంభన జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో పుస్తక ప్రదర్శన పడుగుపాడులో టీడీపీలో చేరిన 150 కుటుంబాలు.. తుఫాను వస్తోంది... అప్రమత్తంగా ఉండాలి ఏకగ్రీవ పంచాయతీలతో దివిసీమ గ్రామాల అభివృద్ధికి బాటలు జపాన్ వెకేషన్ ఫోటోలతో విజయ్ దేవరకొండ సందడి.. రష్మిక మందన్నపై ఆసక్తికర క్యాప్షన్లు ప్రభుత్వ మీడియా నిధుల ప్రణాళికను వ్యతిరేకిస్తూ ప్రాగ్‌లో వేలాది మంది చెక్ ప్రజల నిరసనలు కేటీఆర్‌ను కలిసిన కీసర బీఆర్‌ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు చినింగని బాల్‌రాజ్

పంచాయతీ ఎన్నికల్లో అఖండ మెజారిటీ సాధించాలి.

Select Suryaa Now
పంచాయతీ ఎన్నికల్లో అఖండ మెజారిటీ సాధించాలి.

 

పెదకాకాని న్యూస్ :రాబోయే పంచాయతీ ఎన్నికల్లో పెదకాకాని మండల పరిధిలోని 12 గ్రామపంచాయతీల్లో తెలుగుదేశం పార్టీ అఖండ మెజారిటీతో విజయం సాధించేలా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో సమష్టిగా పనిచేయాలని పెదకాకాని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వలివేటి మురళీకృష్ణ, మండల తెలుగుదేశం పార్టీ కార్యదర్శి తాళ్ల శ్రీనివాసరావు  పిలుపునిచ్చారు. ఎన్నికలను పార్టీ శ్రేణులంతా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, గ్రామస్థాయిలో పటిష్టమైన వ్యూహంతో ముందుకు సాగాలని సూచించారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, గ్రామాల్లో పార్టీ పరిస్థితి, నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం, ఎన్నికల సన్నద్ధత తదితర అంశాలపై ఆయా గ్రామాల నాయకులు కార్యకర్తలు కార్నర్ మీటింగ్లు పెట్టి ఎన్నికలకు కార్యకర్తలను సన్నద్ధం చేయాలన్నారు. ఆయా ప్రాంతాల్లో పార్టీ బలాబలాలను సమీక్షించి నాయకులు పార్టీ గెలిచే విధంగా వార్డ్ అభ్యర్థులను ఎన్నిక చేయాలన్నారు. పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు క్షేత్రస్థాయిలో పనిచేయాలని అన్నారు. గ్రామాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో వ్యవహరించాలని, వ్యక్తిగత అభిప్రాయాలు, విభేదాలకు తావివ్వకుండా పార్టీ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. నాయకులంతా ఐక్యంగా పనిచేస్తేనే ఆశించిన ఫలితాలు సాధించగలమని స్పష్టం చేశారు.
ప్రజలతో నిరంతరం మమేకం కావాలి-----
ప్రజలతో నిరంతరం మమేకమవుతూ వారి సమస్యలను గ్రామస్థాయిలో తెలుసుకోవాలని వాటి పరిష్కార మార్గాలను కూడా ప్రజలకు వివరించాలన్నారు. 
 కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని తెలిపారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది పొందిన కుటుంబాలతో పాటు అన్ని వర్గాల ప్రజలతో సంబంధాలు కొనసాగించాలని చెప్పారు. గ్రామాల్లో ప్రజల అవసరాలు, స్థానిక సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. పెదకాకని మండల పరిధిలోని 12 గ్రామాల్లో పార్టీకి బలమైన పునాది ఉందని, దాన్ని మరింత పటిష్ఠం చేసుకోవాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలపై ఉందని పేర్కొన్నారు. గ్రామాల వారీగా రాజకీయ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఎన్నికల కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక, స్థానిక నాయకుల అభిప్రాయాలు, ప్రజల మద్దతు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు.
ఐక్యతే విజయానికి బలం....
కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే ఎన్నికల్లో పార్టీకి బలమని మురళీకృష్ణ, శ్రీనివాస్ పేర్కొన్నారు. వాటిని ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్లాలని అన్నారు. గ్రామాల్లో పార్టీ శ్రేణులంతా ఐక్యంగా పనిచేస్తూ ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలని పిలుపునిచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించేలా ప్రతి నాయకుడు, కార్యకర్త బాధ్యతగా వ్యవహరించాలని వలివేటి మురళీకృష్ణ, తాళ్ల శ్రీనివాసరావు స్పష్టం చేశారు.