andhrapradesh
డ్రైనేజీ కాలువలో యువకుడి డెడ్బాడీ
పెదకాకాని పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు విడిచాడు. నంబూరు నుంచి పెనుమూలి వెళ్లే రోడ్డులోని డ్రైనేజీ కాలువ వద్ద సుమారు 25 నుంచి 30 ఏళ్ల వయసున్న గుర్తుతెలియని యువకుడి మృతదేహాన్ని గుర్తించారు. మృతికి గల కారణాలు, మృతుడి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.