BREAKING
కేటీఆర్‌ను కలిసిన కీసర బీఆర్‌ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు చినింగని బాల్‌రాజ్ ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం… ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పుస్తక ప్రదర్శనను ప్రారంభించిన ఉమ్మడి నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ శ్రీమతి మేకపాటి శాంతి కుమారి బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 ఫ్యామిలీ వీక్.. కంటెస్టెంట్లపై హైపర్ ఆది పంచ్‌లు, కౌంటర్లు డ్రైనేజీ కాలువలో యువకుడి డెడ్బాడీ ప్రపంచ స్థాయి క్యాన్సర్ వైద్యం పేదలకు అందుబాటులో తేవడమే మా లక్ష్యం. 18 నుండి శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన ఇందుకూరుపేటలో ఖాళీ అవుతున్న వైసీపీ.. టీడీపీలోకి 300 మందికి పైగా చేరిక పారమిత వరల్డ్ స్కూల్  ఆధ్వర్యంలో చిత్రలేఖన పోటీలు రామ్ చరణ్ సినిమాలో అవకాశం.. ఆ కారణంతోనే తిరస్కరించానన్న బండి సరోజ్ కుమార్ పంచాయతీ ఎన్నికల్లో అఖండ మెజారిటీ సాధించాలి. 20 రోజుల తర్వాత స్వగ్రామానికి గంగాధర్ మృతదేహం - నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తుల వేడుకోలు కార్తీక ఆదివారం.. భీమేశ్వరాలయంలో భక్తుల సందడి సుడిగాలి సుధీర్‌తో పెళ్లి పుకార్లపై అషు రెడ్డి స్పందన.. ఏం మాట్లాడాలో తెలియడం లేదంటూ వ్యాఖ్యలు జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు సాల్వీడ్ విద్యార్థిని లావణ్య ఎంపిక

అధికారులు..దళారుల కుమ్మక్కుతో బీమా అక్రమాలా?

Select Suryaa Now
అధికారులు..దళారుల కుమ్మక్కుతో బీమా అక్రమాలా?
సూర్య రాజన్న సిరిసిల్ల ;రాజన్న సిరిసిల్ల జిల్లాలో కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అందిస్తున్న బీమా పథకమే కొందరికి అక్రమ సంపాదన మార్గంగా మారిందనే సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.మరణించిన కార్మికుల పేర్లతో లేబర్ కార్డులు సృష్టించి, నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాల ఆధారంగా బీమా పరిహారాన్ని కాజేస్తున్నారని బోయినపల్లి మండలం నీలోజిపల్లి గ్రామానికి చెందిన బాధితులు ఆరోపించారు. అధికారి,దళారుల కుమ్మక్కుతో ఈ వ్యవహారం సాగుతోందని,అసలు నామినీలకు అందాల్సిన పరిహారం పక్కదారి పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.ఆదివారం రోజున సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో బాధితుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తన మామ దాకూరి మల్లారెడ్డి 2019 ఆగస్టు 14న రామన్నపేటలోని వ్యవసాయ పొలం వద్ద విద్యుదాఘాతంతో మృతి చెందారని తెలిపారు.సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం గ్రామపంచాయతీ నుంచి మరణ ధ్రువీకరణ పత్రం పొందినట్లు చెప్పారు.కొద్దిరోజుల తర్వాత కోదురుపాకకు చెందిన ఓ వ్యక్తి లేబర్ ఆఫీసులో పనిచేస్తానని పరిచయం చేసుకుని,కార్మిక శాఖ ద్వారా రూ.6.30 లక్షల బీమా పరిహారం ఇప్పిస్తానని నమ్మించి అవసరమైన పత్రాలు తీసుకెళ్లినట్లు తెలిపారు.ఆ తర్వాత జరిగిన విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయని శ్రీనివాస్ పేర్కొన్నారు.2019 లోనే మరణించిన తన మామ పేరుతో 2020లో లేబర్ కార్డు రిజిస్ట్రేషన్ చేసి, 2022లో కరీంనగర్ సివిల్ ఆసుపత్రిలో మరణించినట్లు మరో మరణ ధ్రువీకరణ పత్రం సృష్టించి బీమా సొమ్ము డ్రా చేసినట్లు ఆరోపించారు.
 
అధికారి నిర్లక్ష్యం,దళారి బెదిరింపులు!
 
దీనిపై సిరిసిల్ల ఇన్‌ఛార్జి ఏఎల్‌వో కృష్ణసాగర్‌ను ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని, దళారి సైతం బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై కరీంనగర్,వరంగల్ ఉన్నతాధికారులతో పాటు హైదరాబాద్‌లోని లేబర్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్లు శ్రీనివాస్ తెలిపారు.విచారణకు ఆదేశాలు వచ్చిన అనంతరం ఏఎల్‌వో కృష్ణసాగర్ తమ అత్తగారి ఇంటికి వెళ్లి,ఇంట్లో పురుషులు లేని సమయంలో తెల్ల కాగితాలపై సంతకాలు చేయాలని ఒత్తిడి తెచ్చి బెదిరించినట్లు ఆరోపించారు. అంతేకాకుండా పోలీసు హెల్ప్‌లైన్ 100కు ఫోన్ చేయడంతో పాటు బోయినపల్లి పోలీస్ స్టేషన్,జిల్లా కలెక్టర్,ఎస్పీ కార్యాలయాల్లోనూ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
 
సమగ్ర విచారణ జరపాలి.
 
జిల్లాలో ఇలాంటి ఘటనలు ఇంకా ఎన్ని జరిగాయో తేల్చాలని,చనిపోయిన వారి పేర్లతో ఎన్ని లేబర్ కార్డులు సృష్టించి బీమా సొమ్ము కాజేశారో విచారణ జరపాలని బాధితులు డిమాండ్ చేశారు.అసలు నామినీలకు న్యాయం చేసి,బాధ్యులైన అధికారులు,దళారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.ప్రెస్ మీట్ లో అల్వాల లక్ష్మణ్,శ్రీనివాసరెడ్డిలు పాల్గొన్నారు.