నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన పోలీసులు
మెలియాపుట్టి. నవంబర్ 15. మేజర్ న్యూస్.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టెక్కలి DSP లక్ష్మణ రావు, పాతపట్నం CI కే. వెంకట్రావు, మెళియాపుట్టి SI మహమ్మద్ అమీర్ అలీ, పాతపట్నం SI మధుసూదన్ రావు నామినేషన్ కేంద్రాలను ఆదివారం పరిశీలించారు. పాతపట్నం, మెళియాపుట్టి మండలాల్లోని ఆరు కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసు సిబ్బందికి సూచనలు చేశారు