భీమవరం విద్యాచరిత్రలో సువర్ణాధ్యాయం ‘విష్ణు విమెన్స్ యూనివర్సిటీ --కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ --మంత్రులు శ్రీనివాస్ వర్మ లోకేష్ కృషితో యూనివర్సిటీ ఏర్పాటు -- అత్యుత్తమ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తాం : చైర్మన్ విష్ణు రాజు
భీమవరం, నవంబర్ 15: భీమవరం విద్యాచరిత్రలో విష్ణు విమెన్స్ యూనివర్సిటీ ఏర్పాటు ఒక సువర్ణాధ్యాయమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. గత 25 ఏళ్లుగా మహిళలకు నాణ్యమైన ఉన్నత విద్యను అందిస్తూ వేలాది మంది విద్యార్థినుల భవిష్యత్తుకు బాటలు వేసిన శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ, ఆంధ్రప్రదేశ్‌లోనే తొలి ప్రైవేట్ మహిళా విశ్వవిద్యాలయంగా ‘విష్ణు విమెన్స్ యూనివర్సిటీ’ని ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ, డాక్టర్ బి.వి. రాజు ఫౌండేషన్ 25 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఆదివారం భీమవరంలోని విష్ణు క్యాంపస్‌లో నిర్వహించిన ‘విష్ణు కాన్‌ఫ్లుయెన్స్ – మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విష్ణు మహిళ యూనివర్సిటీ గా అనుమతులు సాధించేందుకు విశేషంగా కృషిచేసిన కేంద్రమంత్రి శ్రీనివాస వర్మను చైర్మన్ విష్ణు రాజు ఘనంగా సత్కరించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ, మంత్రి లోకేష్ సహకారంతో యూనివర్సిటీ సాకారమైందని ఆయన అన్నారు. ఈ మహిళా యూనివర్సిటీని భవిష్యత్తులో అత్యుత్తమ ప్రమాణాలతో విదేశాల నుండి సైతం వచ్చి చదువుకునేలా రూపుదిద్దుతామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ ఒక మహిళ విద్యావంతురాలైతే ఆ కుటుంబమంతా అభివృద్ధి చెందుతుందనే దృఢ సంకల్పంతో పద్మభూషణ్ డాక్టర్ బి.వి. రాజు మహిళా విద్యాసంస్థలకు పునాది వేశారని గుర్తుచేశారు. ఆయన దూరదృష్టితో ప్రారంభమైన విద్యా ప్రస్థానం నేడు వేలాది మంది విద్యార్థినులకు ఉన్నత విద్యావకాశాలు కల్పించే స్థాయికి చేరుకోవడం సంతోషకరమన్నారు. సంస్థను నాణ్యతా ప్రమాణాలతో ముందుకు తీసుకెళ్తున్న చైర్మన్ కె.వి. విష్ణు రాజును అభినందించారు.
ఈ గుర్తింపు వెనుక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహిళా విద్యాభివృద్ధి సంకల్పం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రోత్సాహం, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవ ఉన్నాయని తెలిపారు .మంత్రి నారా లోకేష్ త్వరలోనే భీమవరం క్యాంపస్‌ను సందర్శించనున్నారని వెల్లడించారు.
ఈ సందర్భంగా శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ కె.వి. విష్ణు రాజు మాట్లాడుతూ, భీమవరం ప్రాంత ప్రజల ఆదరాభిమానాలు, సహకారం వల్లే విద్యాసంస్థలు ఈ స్థాయికి చేరుకున్నాయని తెలిపారు. విష్ణు విమెన్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ యూనివర్సిటీల చట్టం, అధికారిక గెజిట్‌లో సవరణలు చేయాల్సి వచ్చిందని వివరించారు. ఈ ప్రక్రియలో ప్రత్యేక చొరవ చూపిన కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సంస్థ ప్రస్థానంలో అండగా నిలిచిన స్థానిక ప్రముఖులు అంజిబాబు, గ్రంధి శ్రీనివాస్‌తో పాటు ఇతర ప్రముఖులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ విష్ణు విద్యాసంస్థల చైర్మన్ కె.వి. విష్ణు రాజు, వైస్ చైర్మన్ ఆర్. రవిచంద్రన్, సెక్రటరీ కె. ఆదిత్య విస్సం, జాయింట్ సెక్రటరీ కె. సాయి సుమంత్, శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు, రాజ్యసభ సభ్యుడు పాకా సత్యనారాయణ, ఎమ్మెల్సీలు వెంకటరమణ, కౌరు శ్రీనివాస్, గోపి మూర్తి తదితర పట్టణ ప్రముఖులు, వైద్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.