కేసరి సీతమ్మ కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్సార్‌సీపీ నేతలు
జంగారెడ్డిగూడెం, మేజర్ న్యూస్:చింతలపూడి నియోజకవర్గం కామవరపుకోట మండలం జలపవారిగూడెం గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు కేసరి విజయభాస్కర్ రెడ్డి మాతృమూర్తి స్వర్గీయ కేసరి సీతమ్మ ఇటీవల మృతి చెందడంతో ఆదివారం నిర్వహించిన పెద్దకర్మ కార్యక్రమానికి పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు హాజరై నివాళులర్పించారు.
ఈ కార్యక్రమానికి చింతలపూడి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి కంభం విజయరాజు, మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకులు జెట్టి గురునాథరావు, ఉభయ గోదావరి జిల్లాల బూత్ కమిటీ రీజినల్ కో-ఆర్డినేటర్ బి.వి.ఆర్. చౌదరి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీతమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం విజయభాస్కర్ రెడ్డి, కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కామవరపుకోట మండల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు రాయంకుల సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి వామిశెట్టి హరిబాబుతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.