BREAKING
సిరిపురం విజయ పాల ఉత్పత్తి సహకార సంఘం చైర్మన్ గా మహేందర్ గౌడ్ ఘనవిజయం శ్రీకాకుళం మేయర్ అభ్యర్థిగా దానేటి రాధారాణి ఖరారు.. మంత్రి అచ్చెన్నాయుడును కలిసిన రాధారాణి స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ పూజ కోసం కొమ్మలు కోస్తూ చెరువులో పడి వృద్ధుడు మృతి కీసర ఓఆర్ఆర్ రేడియల్ రోడ్డు లో అక్రమ నిర్మాణాల జోరు...! కాలుష్య రహిత సమాజం కోసం చిన్నారుల బృహత్తర సంకల్పం.. గ్రీన్ వారియర్ అవార్డులతో సత్కారం! ఏఐ, వీఎఫ్ఎక్స్ విమర్శలకు చెక్ పెట్టాలంటే ఇదే మార్గం.. నాగార్జున కీలక సూచన పాత బట్టల గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం.. పూర్తిగా దగ్ధమైన బట్టల నిల్వలు నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి కాకా సినిమా స్పెషల్ సాంగ్‌లో రితికా సింగ్.. మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్‌డేట్ అల్లు అర్జున్ బోయపాటి కాంబినేషన్‌లో మరో సినిమా.. మైథలాజికల్ కథతో పాన్ ఇండియా ప్రాజెక్ట్? గౌతమ్‌తో ప్రేమకథపై కాజల్ అగర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు.. పెళ్లి వెనుక అసలు నిజం ఇదే నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన పోలీసులు కేసరి సీతమ్మ కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్సార్‌సీపీ నేతలు భీమవరం విద్యాచరిత్రలో సువర్ణాధ్యాయం ‘విష్ణు విమెన్స్ యూనివర్సిటీ --కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ --మంత్రులు శ్రీనివాస్ వర్మ లోకేష్ కృషితో యూనివర్సిటీ ఏర్పాటు -- అత్యుత్తమ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తాం : చైర్మన్ విష్ణు రాజు

కీసర ఓఆర్ఆర్ రేడియల్ రోడ్డు లో అక్రమ నిర్మాణాల జోరు...!

Select Suryaa Now
కీసర ఓఆర్ఆర్ రేడియల్ రోడ్డు లో అక్రమ నిర్మాణాల జోరు...!

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ (నవంబరు 15):
మాస్టర్‌ప్లాన్‌లో రేడియల్‌ రోడ్డు కోసం ముందుగానే మినహాయించిన భూమి.. హెచ్‌ఎండీఏ ఆమోదిత లేఅవుట్‌లో చోటు కల్పించని ప్రైవేటు స్థలం.. అయినా అక్కడే నిర్మాణాల జోరు కొనసాగుతోంది. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్,కీసర సర్కిల్‌ పరిధిలోని చీర్యాల గ్రామ రెవెన్యూ పరిధి సర్వే నంబర్లు 110, 111లో ఈ వ్యవహారం చోటుచేసుకుంటోంది. ఓఆర్‌ఆర్‌ మాస్టర్‌ప్లాన్‌లో ప్రతిపాదించిన రేడియల్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ నేపథ్యంలో లేఅవుట్‌ నుంచి మినహాయించిన భూమిని మరో మార్గంలో వినియోగించుకునే ప్రయత్నాలు జరిగాయా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే అక్కడ రెండు భవనాలు, ఒక షెడ్‌ నిర్మించారు. నిర్మాణ అనుమతుల విషయంలో నిబంధనలు పాటించకుండా పనులు కొనసాగుతున్నా సంబంధిత అధికారుల నుంచి చర్యలు లేకపోవడం వారి పర్యవేక్షణ వైఫల్యాన్ని ఎత్తిచూపుతోంద. ఓఆర్‌ఆర్‌ మాస్టర్‌ప్లాన్‌ రూపకల్పన సమయంలోనే ఈ ప్రాంతంలో రేడియల్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ ప్రతిపాదించారు. అందులో భాగంగా సంబంధిత ప్రైవేటు భూమిని హెచ్‌ఎండీఏ ఆమోదిత లేఅవుట్‌లో చేర్చకుండా మినహాయించారు. ఈ భూమి స్థితి, అలైన్‌మెంట్‌ వివరాలు అధికారిక మ్యాప్‌లలో ఉన్నప్పటికీ, అనంతరం ఓపెన్‌ ల్యాండ్‌గా పేర్కొంటూ ఇతర వ్యక్తుల పేర్లపై రిజిస్ట్రేషన్లు జరిగాయి. రహదారి ప్రతిపాదనను పక్కనపెట్టి ఎలాగైనా భూమిని వినియోగించుకునే ప్రయత్నం జరిగిందా? అన్న అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది. క్షేత్రస్థాయి పరిశీలనలో ఇప్పటికే రెండు భవనాలు, ఒక షెడ్‌ నిర్మించినట్లు గుర్తించారు. ప్రస్తుతం కూడా అదే ప్రాంతంలో నిర్మాణ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. నిర్మాణాలకు అవసరమైన అనుమతులు ఉన్నాయా? సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారా? అక్రమ నిర్మాణాలు జరుగుతున్న విషయం తెలిసినా ఎందుకు అడ్డుకోలేదు? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రెండు భవనాలు, మరో షెడ్‌ నిర్మాణం పూర్తయ్యే వరకు అధికార యంత్రాంగం స్పందించకపోవడం పర్యవేక్షణ వ్యవస్థలోని లోపాలను స్పష్టం చేస్తోంది.తెలంగాణ మున్సిపల్‌ చట్టం, భవన నిర్మాణ అనుమతి నిబంధనలు, హెచ్‌ఎండీఏ ప్రణాళికా నిబంధనల ప్రకారం భూమి వినియోగం, మాస్టర్‌ప్లాన్‌ అలైన్‌మెంట్‌కు అనుగుణంగా సంబంధిత అధికారుల అనుమతులు పొందిన తర్వాతే నిర్మాణాలు చేపట్టాలి. ప్రతిపాదిత రహదారి పరిధిలో నిర్మాణాలకు అనుమతి ఉందా లేదా అన్నది సంబంధిత ప్రణాళికా సంస్థ నిర్ధారించాలి. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే పనులు నిలిపివేయడం, నోటీసులు జారీ చేయడం, చట్టప్రకారం చర్యలు తీసుకోవడం అధికారుల బాధ్యత. ఈ నిబంధనలు అమలయ్యేలా చూడాల్సిన అధికారులు మౌనం వహిస్తే అక్రమ నిర్మాణాలకు పరోక్షంగా అవకాశం కల్పించినట్లే అవుతుంది.   భూమి రిజిస్ట్రేషన్ల సమయంలో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం ఏ రికార్డులను పరిశీలించింది? నిర్మాణ అనుమతుల విషయంలో సంబంధిత మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు ఏం చేస్తున్నారు? మాస్టర్‌ప్లాన్‌ అమలును పర్యవేక్షించాల్సిన హెచ్‌ఎండీఏ అధికారుల పాత్ర ఏమిటి? రెవెన్యూ అధికారులు భూమి వాస్తవ స్థితిని పరిశీలించారా? ఇలా ఒక్కో శాఖ బాధ్యతపై అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఒకవైపు రహదారి అభివృద్ధి కోసం భూమిని ముందుగానే లేఅవుట్‌ నుంచి మినహాయిస్తే, మరోవైపు అదే భూమిలో నిర్మాణాలు వెలుస్తుండటం అధికారుల మధ్య సమన్వయ లోపాన్ని సూచిస్తోంది.     ఔటర్‌ రింగ్‌ రోడ్డు ఇప్పటికే నిర్మాణం పూర్తయి రవాణా కొనసాగుతోంది. భవిష్యత్తులో రేడియల్‌ రోడ్డు ప్రతిపాదన అమలులోకి వస్తే ఈ భూమిలో వెలిసిన కట్టడాల పరిస్థితి ఏమిటి? ప్రజాధనంతో చేపట్టే రహదారి అభివృద్ధికి అడ్డంకులు ఏర్పడితే బాధ్యత ఎవరిది? ముందుగానే మాస్టర్‌ప్లాన్‌లో గుర్తించిన భూమిలో నిర్మాణాలు కొనసాగుతుంటే సంబంధిత శాఖలు ఎందుకు అప్రమత్తం కాలేదు?

   జిల్లా కలెక్టర్‌, హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారులు, సంబంధిత మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు తక్షణమే జోక్యం చేసుకోవాలి. సర్వే నంబర్లు 110, 111లోని భూముల రెవెన్యూ రికార్డులు, హెచ్‌ఎండీఏ ఆమోదిత లేఅవుట్‌ మ్యాప్‌, రేడియల్‌ రోడ్డు అలైన్‌మెంట్‌, రిజిస్ట్రేషన్‌ పత్రాలు, నిర్మాణ అనుమతులను సమగ్రంగా పరిశీలించాలి. ఇప్పటికే నిర్మించిన రెండు భవనాలు, ఒక షెడ్‌తోపాటు ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణాలపై విచారణ జరిపి, నిబంధనల ఉల్లంఘన నిర్ధారణ అయితే నిర్మాణాలను నిలిపివేసి బాధ్యులైన అధికారులపై కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. మాస్టర్‌ప్లాన్‌ నిబంధనలను కాపాడాల్సిన అధికారులే వాటి అమలులో నిర్లక్ష్యం వహిస్తే ప్రజా ప్రయోజనాలకు ఎవరు రక్షణ కల్పిస్తారన్నది ప్రశ్నగా మిగులుతోంది.