స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ
కేసముద్రం, మేజర్ న్యూస్, హనుమకొండలోని కాళోజి కళాక్షేత్రం లో ఈ నెల 22 వ తేదీన నిర్వహించునున్న స్వేరో ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని కొరుతూ ఆదివారం కేసముద్రం మున్సిపల్ కేంద్రంలో సమ్మేళనానికి సంబంధించిన వాల్ పోస్టర్ ను బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుగులోత్ వీరునాయక్, మాజీ జడ్పిటిసి రావుల శ్రీనాథ్ రెడ్డి ,బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కమటం శ్రీనివాస్, మున్సిపల్ వార్డ్ కౌన్సిలర్స్ రావుల వినయ్ రెడ్డి,పాయిరాల శరత్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కొండ్రెడ్డి రవీందర్ రెడ్డి, బిర్రు వెంకన్న,పందుల సంజీవ, మోడెం రవీందర్ గౌడ్, ఉప్పర పల్లి సర్పంచ్ ఏర్పుల సునీత కుమారస్వామి, మండల స్వేరో కమిటీ ఆధ్వర్యంలో అధ్య క్షులు మంద ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి పోలేపాక రాజు , ఉపాధ్యక్షులు మిట్టగడుపుల జీవన్ కుమార్ , స్వేరో అధికార ప్రతినిధి గుజ్జునూరు అఖిల్, స్వేరో మండల కమిటీ కన్వీనర్ పోలేపాక రాజు ఆధ్వర్యంలో పోస్టర్ ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా నాయ కులు మాట్లాడుతూ.. స్వేరో ఉద్యమం, విద్య, ఆత్మగౌరవం,సమానత్వం, సామాజిక న్యాయం,ఐక్యత వంటి గొప్ప ఆశయాలతో ప్రజల్లోకి తీసుకెళు తున్న ఈ ఉద్యమం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాల ను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు విద్యా వంతులై సంఘటితమై సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.స్వేరో మండల అధ్యక్షులు మంద ప్రవీణ్ మాట్లా డుతూ జై భీమ్ జై స్వేరో నినాదంతో యువతను ఉన్నత చదువుల వైపు ముందుకు నడిపించ డముతో పాటు జ్ఞాన సమాజ నిర్మాణ చేయడమే స్వేరో ఉద్యమ లక్ష్యముగా డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ చేస్తున్న సేవలు వెలకట్టలేనివని ఆయన స్ఫూర్తితో వేలాది మంది విద్యార్థులు, యువ కులు విద్యా ఉద్యోగం సామాజిక రంగాలలో ముందుకు వెళ్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమానికి స్వేరో అభిమానులు,విద్యార్థులు, యువకులు, మేధావులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.
రిపోర్టర్: వెంకన్న, కేసముద్రం, మహబూబాద్ జిల్లా