సిరిపురం విజయ పాల ఉత్పత్తి సహకార సంఘం చైర్మన్ గా మహేందర్ గౌడ్ ఘనవిజయం
లింగాలఘణపురం, మేజర్ న్యూస్, లింగాలఘణపురం మండల పరిధిలోని సిరిపురం గ్రామంలో నిర్వహించిన విజయ పాల ఉత్పత్తి సహకార సంఘం ఎన్నికలు ఉత్కంఠభరితంగా సాగాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన ప్యానెల్ చైర్మన్ అభ్యర్థి బస్వగాని మహేందర్ గౌడ్ ఒక్క ఓటు తేడాతో ఘన విజయం సాధించారు.సంఘంలో మొత్తం 51 మంది సభ్యులు ఉండగా, అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓట్ల లెక్కింపులో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి బస్వగాని మహేందర్ గౌడ్‌కు 26 ఓట్లు పోలవ్వగా, సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థికి 25 ఓట్లు వచ్చాయి. దీంతో అత్యంత ఉత్కంఠ నడుమ ఒక్క ఓటు ఆధిక్యంతో మహేందర్ గౌడ్ చైర్మన్‌గా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఆయన గెలుపుతో గ్రామంలోని బీఆర్ఎస్ శ్రేణులు, పాడి రైతులు సంబరాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో సంఘం డైరెక్టర్లు బర్ల నర్సయ్య, టీ. రాఘవ రెడ్డి, కే. పారిజాతం, జి. విజయ్, కే. చంద్రయ్య, పి. రాజు, బస్వగాని రాములు, ఎస్. రవి, సంఘం కార్యదర్శి బస్వగాని అశోక్, బీఆర్ఎస్ నాయకులు బస్వగాని శ్రీనివాస్, నాగులు, లారెన్స్‌తో పాటు గ్రామ ప్రజలు, పాడి రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన చైర్మన్‌ను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
రిపోర్టర్; కార్తీక్, లింగాల గణపురం, జనగామ జిల్లా