BREAKING
ముఖ్యమంత్రి బహిరంగ సభకు పకడ్బందీ ఏర్పాట్లు16 ఎకరాల్లో సభా ప్రాంగణం.. లెవెలింగ్ పనులు దాదాపు పూర్తి మద్యం మత్తులో బంధువును ఇటుకతో కొట్టి దారుణ హత్య మార్కెట్ కమిటీ చైర్మన్ కు సన్మానం... బాలల దినోత్సవ వేడుకలు 7 వ అంగన్వాడిలో కేంద్రంలో బాలల దినోత్సవం చట్టాలను తుంగలో తొక్కి.. రాత్రివేళల్లో అక్రమ బోర్ల తవ్వకాలు కొడకండ్ల లోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మించాలి హుజురాబాద్ క్లబ్ ఎన్నికల్లో కార్యదర్శిగా మల్లారెడ్డి విజయం ప్రమాద స్థితిలో మురుగు కాలువ వంతెన 80 ఏళ్ల వృద్ధుడు పోటీ ప్రజా తీర్పుకు బాధ్యతగా పనిచేయాలి సిరిపురం విజయ పాల ఉత్పత్తి సహకార సంఘం చైర్మన్ గా మహేందర్ గౌడ్ ఘనవిజయం శ్రీకాకుళం మేయర్ అభ్యర్థిగా దానేటి రాధారాణి ఖరారు.. మంత్రి అచ్చెన్నాయుడును కలిసిన రాధారాణి స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ పూజ కోసం కొమ్మలు కోస్తూ చెరువులో పడి వృద్ధుడు మృతి

ప్రజా తీర్పుకు బాధ్యతగా పనిచేయాలి

Select Suryaa Now
ప్రజా తీర్పుకు బాధ్యతగా పనిచేయాలి

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంమున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పునకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని ప్రజల మన్ననలను పొందాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి శుభాష్ పిలుపునిచ్చారు

మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన మున్సిపల్ చైర్మన్ మేడిశెట్టి శేషారావు, కూటమి కౌన్సిలర్లతో మంత్రి సుభాష్ ఆదివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన చైర్మన్ మేడిశెట్టి శేషారావు, కూటమి కౌన్సిలర్లకు మంత్రి అభినందనలు తెలియజేస్తూ, పట్టణ అభివృద్ధి, ప్రజా సంక్షేమం లక్ష్యంగా భవిష్యత్తులో అనుసరించాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు.  ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన ప్రతి ఒక్కరూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజలకు నిరంతరం వివరిస్తూ, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా నిలవాలని పిలుపునిచ్చారు.

 పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు చైర్మన్, కౌన్సిలర్లు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రతి వార్డులో మౌలిక సదుపాయాల కల్పన, పారిశుధ్యం, తాగునీరు, రహదారులు వంటి ప్రజా అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు. కౌన్సిలర్లు లేని వార్డుల్లో ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఇన్చార్జులుగా బాధ్యతలు స్వీకరించి, ఆయా ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు. ఎన్నికల్లో సాధించిన విజయం కేవలం ఐదేళ్లకే పరిమితం కాకుండా, ప్రజల ఆదరాభిమానాలతో నిరంతరం కొనసాగాలంటే ప్రజలతో మమేకమై, వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని స్పష్టం చేశారు.ఐదేళ్ల విజయాన్ని శాశ్వత ప్రజాభిమానంగా మలుచుకుందాం అని మంత్రి సుభాష్ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కూటమి సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం, మున్సిపల్ చైర్మన్ మేడిశెట్టి శేషారావు, ఏఎంసీ చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.