శ్రీకాకుళం మేయర్ అభ్యర్థిగా దానేటి రాధారాణి ఖరారు.. మంత్రి అచ్చెన్నాయుడును కలిసిన రాధారాణి
కోటబొమ్మాళి, నవంబర్ 15, మేజర్ న్యూస్: శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా కూటమి తరఫున జనసేన పార్టీ నాయకురాలు దానేటి రాధారాణి పేరు అధికారికంగా ఖరారైంది. ఈ నేపథ్యంలో ఆదివారం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా మేయర్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న రాధారాణికి మంత్రి అచ్చెన్నాయుడు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆమె భర్త డాక్టర్ దానేటి శ్రీధర్, జనసేన నాయకులు చైతన్య తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్
గంట అప్పన్న