బాలల అభిప్రాయాలకు గౌరవిస్తూ వారి సమస్యలను పరిష్కరిద్దాం
నెల్లికుదురు , మేజర్ న్యూస్, బాలల అభిప్రాయాలకు గౌరవిస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేద్దామని శ్రీరామగిరి సర్పంచ్ మాదరి ప్రశాంత్ అన్నారు. మండలంలోని శ్రీరామగిరి, తార్ సింగ్ బావి తండలోని గ్రామ పంచాయతీలలో
జాతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామాల సర్పంచ్లు మాదరి ప్రశాంత్, గుగులోతు అశోక్ అధ్యక్షతన బాలల గ్రామసభలను ఘనంగా నిర్వహించారు.అనంతరం వారు వేరువేరుగా భారతదేశ తొలి ప్రధానమంత్రి, బాలల ప్రియతమ నాయకుడు, చాచా నెహ్రూగా ప్రసిద్ధి చెందిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ ఈ బాలల గ్రామసభలో పిల్లల హక్కులు, విద్య, ఆరోగ్యం, పోషకాహారం, పరిశుభ్రత, రక్షణ వారి భవిష్యత్తుకు సంబంధించిన అంశాలపై చర్చించడం జరిగిందని అన్నారు.నేటి బాలలే రేపటి భారత పౌరులు, పిల్లలే దేశ భవిష్యత్తుకు పునాదులు, వారి కలలను సాకారం చేయడానికి, వారికి నాణ్యమైన విద్య, మెరుగైన ఆరోగ్యం, సురక్షితమైన వాతావరణం కల్పించడానికి గ్రామపంచాయతీ తరఫున అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామనిహామీ ఇచ్చారు.బాలల హక్కులను గౌరవిద్దాం,వారి కలలకు రెక్కలు తొడుగుదాం, ప్రతి బిడ్డకు ఉజ్వల భవిష్యత్తును అందిద్దాం అని అన్నారు.సమావేశ అనంతరం పిల్లలకు స్వీట్లు పంపిణీ చేసి,బాలలందరికీ జాతీయ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ రామగిరి సుమన్, పంచాయతీ సెక్రటరీ మౌనిక, అంగన్వాడీ టీచర్స్, తార్ సింగ్ బావి ఉపసర్పంచ్ శ్రీలత, పంచాయతీ కార్యదర్శి ఆంజనేయులు, వార్డు మెంబర్లు రజిత, వెంకన్న, రవి, అంగన్వాడీ టీచర్లు శారద, మైబు, జాటోతు నీలా, గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామ పెద్దలు పాఠశాల విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు.
రిపోర్టర్; ప్రసాద్, నెల్లికుదురు, మహబూబాద్ జిల్లా