మేరా యువ భారత్ యూత్ వాలంటీర్‌గా సాయి వంశీ గౌడ్ ఎంపిక
మేరా యువ భారత్ యూత్ వాలంటీర్‌గా సాయి వంశీ గౌడ్ ఎంపిక
పాల్వంచ, సూర్య(మేజర్ న్యూస్)- యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు వారి ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో మేరా యువ భారత్ - ఖమ్మం ఆధ్వర్యంలో పాల్వంచకు చెందిన చామకూరి సాయి వంశీ గౌడ్‌ను పాల్వంచ - లక్ష్మీదేవిపల్లి బ్లాక్ మేరా యువ భారత్ యూత్ వాలంటీర్‌గా ఎంపిక చేశారు.యూత్ క్లబ్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినందుకు గుర్తింపుగా ఈ అవకాశం దక్కిందని తెలిపారు.ఈ సందర్భంగా సాయి వంశీ గౌడ్ మాట్లాడుతూ, తనను ఎంపిక చేసిన మేరా యువ భారత్ యూత్ అధికారులందరికీ ధన్యవాదాలు తెలిపారు.