పాల్వంచలో ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు
పాల్వంచ, సూర్య(మేజర్ న్యూస్)- పాల్వంచ మండల, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు భువన సుందర రెడ్డి, నూకల రంగారావు ఆధ్వర్యంలో సిద్ధార్థ హైస్కూల్‌లో జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట దేవీప్రసన్న నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ లలిత కుమారి, కొత్వాల శ్రీనివాసరావు, బాలు నాయక్, చీకటి కార్తీక్, గద్దల రమేష్, సాదం రామకృష్ణ, పలువురు కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.