BREAKING
భక్తులకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు మందపల్లి ఆలయంలో పోటెత్తిన భర్త జనం రాజకీయాలలో గెలుపుఓటములు సహజం : సమిష్టిగా పనిచేసే పట్టణ అభివృద్ధికి కృషిచేద్దాం : పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ అండగా ఉంటాం : మదనపల్లి మునిసిపల్ చైర్మన్ శ్రీరామ్ చినబాబు హామీ తుఫాన్ దాటికి బాధితుల ఆవేదం చిన్నారుల ఆనందమే మా లక్ష్యం... రాజేంద్రనగర్ ప్రజల ప్రేమాభిమానాలు మరువలేను అమ్మవారి సేవా కార్యక్రమాలకు రూ.2.01 లక్షల విరాళాలు అమ్మవారి సేవా కార్యక్రమాలకు రూ.2.01 లక్షల విరాళాలు భక్తులకు అన్నప్రసాద ఏర్పాట్ల పరిశీలన కార్తీక మాసంలో వైభవంగా సహస్ర లింగార్చన సింగరేణిలో ఏఐటీయూసీ రిలే నిరాహార దీక్షలు.. స్వేచ్ఛాయుత ఎన్నికలే లక్ష్యం బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు నెహ్రూ జీవిత చరిత్ర వివరించిన ఎంఈవో ఖాసీం పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ విద్యార్థులు బాల్యం నుండే మహనీయుల ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని పిడుగురాళ్ల మండల విద్యాశాఖ అధికారి ఎండి ఖాసీం అన్నారు. గురువారం పిడుగురాళ్ల పట్టణంలోని మండల ప్రాథమిక పాఠశాల ఎస్ఆర్ (జము *కుందుర్పిమండలంలో పంచాయతీ పోరు రసవత్తరం* తీన్మార్ మల్లన్నపై హత్యాయత్నాన్ని ఖండిస్తున్నాం

సింగరేణిలో ఏఐటీయూసీ రిలే నిరాహార దీక్షలు..

Select Suryaa Now
సింగరేణిలో ఏఐటీయూసీ రిలే నిరాహార దీక్షలు..

కొత్తగూడెం సింగరేణి, సూర్య(మేజర్ న్యూస్)- సింగరేణి కార్మికుల పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 18, 19 తేదీల్లో అన్ని ఏరియాల జీఎం కార్యాలయాల ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) నాయకులు ప్రకటించారు.శనివారం కొత్తగూడెంలోని శేషగిరిభవన్‌లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో నాయకులు వంగ వెంకట్, జి. వీరస్వామి మాట్లాడుతూ, ఏఐటీయూసీ కేంద్ర నాయకత్వం పిలుపు మేరకు ఈ దీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కొత్తగూడెం ఏరియా జీఎం కార్యాలయం ఎదుట జరిగే దీక్షల్లో కార్మికులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ప్రభుత్వం, యాజమాన్యం జాప్యం చేస్తున్న నేపథ్యంలోనే ఈ పోరాటానికి దిగుతున్నామని నాయకులు తెలిపారు.
ఈ క్రమంలో తమ ప్రధాన డిమాండ్ లను వివరించారు. ప్రతి నెలా మెడికల్ బోర్డు నిర్వహించి 100 శాతం డిపెండెంట్ ఉద్యోగాలు కల్పించాలి. మెడికల్ ఫిట్ అయి ఎదురుచూస్తున్న సుమారు 200 మంది డిపెండెంట్లకు వెంటనే నియామక పత్రాలు ఇవ్వాలి. టీఎస్ జెన్‌కో, ట్రాన్స్‌కో నుంచి సింగరేణికి రావాల్సిన రూ.59,వేల కోట్ల బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలి.ఈ సమావేశంలో బ్రాంచ్ కార్యదర్శులు ఎస్.వి. రమణమూర్తి, జక్కుల గట్టయ్య, నాయకులు లక్ష్మీనారాయణ, చంద్రయ్య, మండల రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.