మందపల్లి ఆలయంలో పోటెత్తిన భర్త జనం
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంమండల పరిధిలోని మందపల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ మందేశ్వర (శనేశ్వర) స్వామివారి దేవస్థానంలో శనివారం భక్తుల సందడి నెలకొంది.శనివారం సందర్భంగా తెల్లవారుజాము నుంచే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు.ప్రాతఃకాల అర్చనలు,ప్రత్యేక పూజల అనంతరం భక్తులు స్వామివారికి భక్తిశ్రద్ధలతో తైలాభిషేకాలు నిర్వహించి సర్వదర్శనం చేసుకున్నారు.ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.ఆలయ సహాయ కమిషనర్,కార్యనిర్వహణాధికారి దారపురెడ్డి సురేష్‌బాబు ఆధ్వర్యంలో భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించారు.దర్శనం,తైలాభిషేకాల నిర్వహణలో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించారు.వివిధ సేవలు,తైలాభిషేకాల ద్వారా స్వామివారి దేవస్థానానికి రూ.2,69,084 ఆదాయం సమకూరినట్లు ఈవో సురేష్‌బాబు తెలిపారు.