గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
రేణిగుంట మేజర్ న్యూస్: తిరుపతి నాయుడు పేట జాతీయ రహదారి వెద్దలచెరువు సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని సుమారు 60 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడు ఎర్రటి చొక్కా, గళ్ల లుంగీ ధరించి, మాసిన గడ్డం, జుట్టుతో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసినవారు లేదా కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించి సమాచారం అందించాలని పోలీసులు కోరారు.