రాజకీయాలలో గెలుపుఓటములు సహజం : సమిష్టిగా పనిచేసే పట్టణ అభివృద్ధికి కృషిచేద్దాం : పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ అండగా ఉంటాం : మదనపల్లి మునిసిపల్ చైర్మన్ శ్రీరామ్ చినబాబు హామీ
మదనపల్లె,మేజర్ న్యూస్ : మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి చెందిన కూటమి అభ్యర్థులు,పార్టీ నాయకులు,కార్యకర్తల్లో ధైర్యం నింపేందుకు మున్సిపల్ చైర్మన్,రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు గుండ్లపల్లి శ్రీరామ్ చినబాబు చేపట్టిన భరోసా కార్యక్రమం కొనసాగుతోంది.ఇందులో భాగంగా పట్టణంలోని 31వ వార్డు టీడీపీ ఇంచార్జ్ పులి మహాలక్ష్మి నివాసానికి వెళ్లి ఆమెను ఆత్మీయంగా పరామర్శించి భరోసా కల్పించారు.అనంతరం 32వ వార్డు టీడీపీ ఇంచార్జ్ తలారి రాధ,6వ వార్డు టీడీపీ ఇంచార్జ్ తలకాయల శీనా,21వ వార్డు టీడీపీ ఇంచార్జ్ నాగూర్ వలి (షో ఆఫ్ సీనా),22వ వార్డు టీడీపీ ఇంచార్జ్ సాకే లక్ష్మీదేవి నివాసాలకు సైతం వెళ్లి వారితో మాట్లాడారు.ఎన్నికల్లో గెలుపోటములు సహజమని,ఓటమి చెందినంత మాత్రాన ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని చినబాబు భరోసా ఇచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మున్సిపల్ ఎన్నికల్లో తాను వైసీపీ తరఫున గెలిచినప్పటికీ మదనపల్లెలో టీడీపీ జెండా ఎగరడానికి పులి మహాలక్ష్మి చేసిన కృషి ఎంతో ఉందని గుర్తుచేశారు.ఒక తమ్ముడిని చైర్మన్గా చేసిన ఆనందంతో ఆమె ధైర్యంగా ముందుకు సాగాలని,తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు.అదేవిధంగా 21వ వార్డు ఇన్చార్జ్ నాగూర్ వలి తెలుగుదేశం పార్టీ బలోపేతానికి అహర్నిశలు శ్రమించారని,ఒక సైనికుడిలా పనిచేశారని గుర్తుచేశారు.పార్టీ కోసం కష్టపడిన నాయకులు,కార్యకర్తలను ఎప్పటికీ మరిచిపోమని స్పష్టం చేశారు.కూటమి అభ్యర్థులు అభివృద్ధిని నమ్ముకుని ప్రజల్లోకి వెళ్లారని,ప్రజలు అపూర్వ విజయాన్ని అందించారని పేర్కొన్నారు.ఈ విజయం తమపై మరింత బాధ్యతను పెంచిందని,మదనపల్లె పట్టణంతోపాటు అన్ని వార్డుల అభివృద్ధికి కృషి చేస్తామని చినబాబు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు గంగారపు రామూర్తి నాయుడు,యాలగిరి దొరస్వామి నాయుడు,టౌన్ ప్రెసిడెంట్ అరుణ్ తేజ్,టౌన్ బ్యాంక్ డైరెక్టర్ జోళపాళ్యం దేవేంద్ర (చిన్ని),వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ మండెం ప్రభాకర్,మదనపల్లె నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షుడు కాశీ శ్రీరామ్ వాల్మీకి,రాష్ట్ర బీసీ సాధికార సమితి సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ మంగళ ప్రభాకర్,మదనపల్లె టమోటా మార్కెట్ డైరెక్టర్ ఆర్.సుబ్రహ్మణ్యం రెడ్డి,మడికయ్యల శివాలయం డైరెక్టర్ కలిశం ప్రకాష్ నాయుడు,క్లస్టర్ ఇంచార్జ్ మల్లెం ప్రకాష్ నాయుడు,యూనిట్ ఇంచార్జ్ పసుపులేటి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి