BREAKING
ఇమాంపూర్ గ్రామంలో భారీ వాహనాల బీభత్సం బాలాజీ కుటుంబానికి శ్రీ రాజ్య తండా నాయకుల పరామర్శ విద్యార్థులు గ్రంధాలయాలు సద్వినియోగం చేసుకోవాలి అక్రమ పేలుడు పదార్థాలు స్వాధీనం... ఇద్దరిపై కేసు గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం విద్యార్థుల ఆరోగ్యమే లక్ష్యంగా దోమతెరల పంపిణీ* *- డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ఖాజా మౌనద్దీన్* భక్తులకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు మందపల్లి ఆలయంలో పోటెత్తిన భర్త జనం రాజకీయాలలో గెలుపుఓటములు సహజం : సమిష్టిగా పనిచేసే పట్టణ అభివృద్ధికి కృషిచేద్దాం : పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ అండగా ఉంటాం : మదనపల్లి మునిసిపల్ చైర్మన్ శ్రీరామ్ చినబాబు హామీ తుఫాన్ దాటికి బాధితుల ఆవేదం చిన్నారుల ఆనందమే మా లక్ష్యం...

భక్తులకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు

Select Suryaa Now
భక్తులకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం

రానున్న గోదావరి మహా పుష్కరాలకు విచ్చేసే భక్తులకు ప్లాస్టిక్ రహిత విధానంలో స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీటిని అందించేందుకు వినూత్నమైన పర్యావరణహిత పరిష్కారాలతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ పి. కృష్ణయ్య సూచించారు. శనివారం రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలోని పీజీఆర్ఎస్ హాలులో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ పరిశ్రమల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పరిశ్రమల ప్రతినిధుల అభిప్రాయాలను, పుష్కరాల సమయంలో తాగునీటి సరఫరాకు సంబంధించి వారి ప్రతిపాదనలను తెలుసుకున్నారు.

ఆయన మాట్లాడుతూ, భక్తులు తమ వెంట తెచ్చుకునే వాటర్ బాటిళ్లను తిరిగి నింపుకునేందుకు నగరంలోని కీలక ప్రాంతాల్లో రీఫిల్లింగ్ స్టేషన్లు, వాటర్ ఏటీఎంలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇందుకోసం అవసరమైన ప్రాంతాలను గుర్తించి, ఎన్ని తాగునీటి కేంద్రాలు ఏర్పాటు చేయాలనే అంశంపై సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. రీఫిల్లింగ్ కేంద్రాలు, ప్లాస్టిక్ బాటిళ్ల సేకరణ పాయింట్ల వివరాలు తెలియజేసేలా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వం సరఫరా చేసే శుద్ధి చేసిన సురక్షిత తాగునీటి వినియోగంపై డిజిటల్ స్క్రీన్ల ద్వారా భక్తులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ పరిశ్రమలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై పర్యావరణహిత విధానాలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.

పుష్కరాల సమయంలో పూజా సామగ్రిని ప్లాస్టిక్ కవర్లకు బదులుగా పర్యావరణహితమైన, సంప్రదాయ ప్యాకేజింగ్ పద్ధతుల్లో విక్రయించేలా చర్యలు తీసుకోవాలని ఛైర్మన్ సూచించారు. అన్నదానాలు, మజ్జిగ పంపిణీ కార్యక్రమాల్లో ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసుల వినియోగాన్ని నివారించాలని, ప్రసాద వితరణకు అరిటాకు కప్పులు వంటి సంప్రదాయ పర్యావరణహిత వస్తువులను వినియోగించేలా దాతలకు అవగాహన కల్పించాలన్నారు.గోదావరి మహా పుష్కరాలకు వచ్చే భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. పుష్కరాల సందర్భంగా తాగునీటి సరఫరా, ప్లాస్టిక్ వినియోగ నియంత్రణ, వ్యర్థాల నిర్వహణకు సంబంధించి వివిధ శాఖల సమన్వయంతో ముందస్తు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులకు ఎక్కడికక్కడ సురక్షిత తాగునీరు అందుబాటులో ఉండేలా అవసరమైన ప్రాంతాలను గుర్తించి తగిన ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు సూచించారు.

ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు ప్రజలు, వ్యాపారులు, సేవా సంస్థలు, దాతలను భాగస్వాములను చేయాలని  పేర్కొన్నారు. పర్యావరణహిత వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహించడంతో పాటు భక్తులకు అవసరమైన సమాచారం అందించేలా విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు.గోదావరి పుష్కరాల నేపథ్యంలో నగర పరిధిలో తాగునీటి రీఫిల్లింగ్ కేంద్రాలు, వాటర్ ఏటీఎంలు, ప్లాస్టిక్ బాటిళ్ల సేకరణ కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన ప్రాంతాలను గుర్తించి కార్యాచరణ రూపొందిస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు. భక్తులకు సులభంగా సేవలు అందేలా సూచిక బోర్డులు, డిజిటల్ సమాచార వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు పర్యావరణహిత విధానాల అమలుకు చర్యలు చేపడతామని పేర్కొన్నారు.అనంతరం మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ పి. కృష్ణయ్య పరిశీలించారు. పుష్కరాల సందర్భంగా భక్తులకు అవసరమైన పూజా సామగ్రి బుట్టలు, పర్యావరణహిత బ్యాగులు తదితర వస్తువులను పరిశీలించి పలు సూచనలు చేశారు. వీటిని తక్కువ ధరలకు అందుబాటులో ఉంచడం ద్వారా ఎక్కువ మంది భక్తులు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత మెప్మా అధికారులకు సూచించారు.

ఈ సమావేశంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చీఫ్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ రాజశేఖర్, సభ్య కార్యదర్శి శరవణన్, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ పరిశ్రమల ప్రతినిధులు, సంబంధిత అధికారులు, మెప్మా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.