రాజేంద్రనగర్ ప్రజల ప్రేమాభిమానాలు మరువలేను
ఉయ్యూరు, మేజర్ న్యూస్ : రాజేంద్రనగర్ ప్రజలు తన కుటుంబ సభ్యుల్లాంటి వారని, వారి ప్రేమాభిమానాలను ఎన్నటికీ మర్చిపోలేనని తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ వై.వీ.బీ. రాజేంద్రప్రసాద్ అన్నారు. ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్‌గా విజయం సాధించిన చేదుర్తిపాటి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో రాజేంద్రనగర్ వాసులు, పెద్దల కమిటీ సభ్యులు రాజేంద్రప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేయించి, ఆయనను ఘనంగా సత్కరించారు. 2001లో రాజేంద్రనగర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 105 ఇళ్లు దగ్ధమై, సర్వస్వం కోల్పోయిన కుటుంబాలను అప్పట్లో రాజేంద్రప్రసాద్ ఆదుకున్నారని కాలనీవాసులు గుర్తుచేశారు. సర్పంచ్‌గా గ్రామ పంచాయతీ, సామాజిక సేవా సంస్థలు, ప్రభుత్వ సహకారంతో నిధులు సమీకరించి బాధితులకు 105 పక్కా ఇళ్లను ఉచితంగా నిర్మించి ఇవ్వడంతో పాటు ఇంటి సామగ్రిని కూడా అందించారని తెలిపారు. ఆయన చేసిన సేవలకు కృతజ్ఞతగా తమ కాలనీకి రాజేంద్రనగర్ అని పేరు పెట్టుకున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ రాజేంద్రనగర్ ప్రజలతో తనకున్న అనుబంధం ప్రత్యేకమైనదని, వారి కష్టసుఖాల్లో ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చేదుర్తిపాటి ప్రవీణ్ కుమార్, కౌన్సిలర్లు కోలగాని సునీత, పరిమి సలోమి, డాలి, టీడీపీ నాయకులు కొలగాని సాంబశివరావు, పరిమి సజిత్, రాజేంద్రనగర్ కాలనీవాసులు పాల్గొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, పెనమలూరు నియోజకవర్గం, కృష్ణాజిల్లా.