BREAKING
భక్తులకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు మందపల్లి ఆలయంలో పోటెత్తిన భర్త జనం రాజకీయాలలో గెలుపుఓటములు సహజం : సమిష్టిగా పనిచేసే పట్టణ అభివృద్ధికి కృషిచేద్దాం : పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ అండగా ఉంటాం : మదనపల్లి మునిసిపల్ చైర్మన్ శ్రీరామ్ చినబాబు హామీ తుఫాన్ దాటికి బాధితుల ఆవేదం చిన్నారుల ఆనందమే మా లక్ష్యం... రాజేంద్రనగర్ ప్రజల ప్రేమాభిమానాలు మరువలేను అమ్మవారి సేవా కార్యక్రమాలకు రూ.2.01 లక్షల విరాళాలు అమ్మవారి సేవా కార్యక్రమాలకు రూ.2.01 లక్షల విరాళాలు భక్తులకు అన్నప్రసాద ఏర్పాట్ల పరిశీలన కార్తీక మాసంలో వైభవంగా సహస్ర లింగార్చన సింగరేణిలో ఏఐటీయూసీ రిలే నిరాహార దీక్షలు.. స్వేచ్ఛాయుత ఎన్నికలే లక్ష్యం బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు నెహ్రూ జీవిత చరిత్ర వివరించిన ఎంఈవో ఖాసీం పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ విద్యార్థులు బాల్యం నుండే మహనీయుల ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని పిడుగురాళ్ల మండల విద్యాశాఖ అధికారి ఎండి ఖాసీం అన్నారు. గురువారం పిడుగురాళ్ల పట్టణంలోని మండల ప్రాథమిక పాఠశాల ఎస్ఆర్ (జము *కుందుర్పిమండలంలో పంచాయతీ పోరు రసవత్తరం* తీన్మార్ మల్లన్నపై హత్యాయత్నాన్ని ఖండిస్తున్నాం

కార్తీక మాసంలో వైభవంగా సహస్ర లింగార్చన

Select Suryaa Now
కార్తీక మాసంలో వైభవంగా సహస్ర లింగార్చన

ఇంద్రకీలాద్రి, మేజర్ న్యూస్ : పవిత్ర కార్తీక మాస ఉత్సవాలను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలోని మల్లేశ్వరస్వామి వారి ఆలయంలో శనివారం ప్రదోష కాలంలో ఆకాశదీపం, సహస్ర లింగార్చన, సహస్ర దీపాలంకరణ, ఊయల సేవ కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు, అర్చక బృందం వేద మంత్రోచ్ఛారణల నడుమ శాస్త్రోక్తంగా విశేష పూజలు నిర్వహించారు. కార్తీక మాసంలో సహస్ర లింగార్చనలో పాల్గొని పరమేశ్వరుడిని దర్శించుకోవడం వల్ల సమస్త పాపాలు, గ్రహదోషాలు తొలగిపోతాయని, వేయి లింగాలకు ఏకకాలంలో నిర్వహించే ఈ విశేష అర్చనతో భక్తులకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని అర్చకులు తెలిపారు. ఈ పూజా కార్యక్రమాల్లో దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు సమర్పించారు. సహస్ర దీపాల కాంతుల నడుమ సాగిన అర్చన, అనంతరం నిర్వహించిన దుర్గా మల్లేశ్వర స్వామివార్ల ఊయల సేవ భక్తులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమం అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు రాఘవరాజు, ఎ. శ్రీనివాసరావు, సరిత, పద్మావతి ఠాకూర్, ప్రత్యేక ఆహ్వానితులు వి. శంకర బాబు తదితరులు పాల్గొన్నారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.